Saturday, January 11, 2025

రిలీఫ్‌.. టేక్‌ రెస్ట్‌

అల్లు అర్జున్‌కు ఊరట

హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ప్రతి ఆదివారం హాజరు కావాలన్న నిబంధనను కోర్టు మినాహాయించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలని గతంలో కోర్టు షరతు విధించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ కోరారు. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలని గతంలో కోర్టు షరతు విధించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ కోరారు. దీనికి నాంపల్లి కోర్టు అంగీకారం తెలిపింది. మరోవైపు అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు కూడా న్యాయస్థానం అనుమతించింది. కాగా.. సంథ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటనలో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న నేపథ్యంలో విచారణకు సహకరించాలని చెబుతూ ప్రతీ ఆదివారం కూడా విచారణకు హాజరుకావాలని కోర్టు షరతు విధించింది. ప్రతీ ఆదివారం కూడా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్‌స్టేసన్‌కు వెళితే భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని.. ఆదివారం రోజున వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యే అంశాన్ని ఎత్తివేయాలని నాంపల్లి కోర్టులో మరొక పిటిషన్‌ను బన్నీ దాఖలు చేశారు.
ప్రతీ ఆదివారం విచారణకు మినాహాయింపు ఇచ్చింది. కానీ అల్లు అర్జున్‌ను విచారణ చేయాలని భావిస్తే నోటీసు ఇచ్చి పోలీసులు విచారణ జరపవచ్చని తేల్చిచెప్పింది. భద్రతా కారణాల వల్ల మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లు నాంపల్లి కోర్టు స్పష్టం చేస్తోంది. ఈ కేసు విచారణ దశలో ఉన్న తరుణంలో విదేశాలకు వెళ్లేందుకు వీలులేదని కోర్టు తొలత చెప్పింది. ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న కోర్టు.. అల్లు అర్జున్‌ను విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఇప్పటి వరకు అల్లు అర్జున్‌ను నాలుగు సార్లు పోలీసులు విచారించారు. స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఈ కేసులో మొత్తం 18 మందిని నిందితులుగా చేర్చారు. ఇంకా ఈ కేసు చార్జ్‌షీట్ అయ్యేంత వరకు విచారణ కొనసాగనుంది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్లు పూర్తి అయ్యారు. ఈ కేసులో ఇంకా విచారణ జరపాలని పోలీసులు భావిస్తే అల్లు అర్జున్ విచారణకు సహకరించాలని బెయిల్ షరతుల్లో కచ్చితంగా పేర్కొన్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌‌ను మరోసారి విచారణకు పిలుస్తారా లేదా అని స్పష్టత రావాల్సి ఉంది. ఈ కేసులో దాదాపు 80 శాతం విచారణ పూర్తవగా.. చార్జ్‌షీట్ వేసేందుకు కూడా చిక్కడపల్లి పోలీసులు సిద్ధంగా ఉన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com