-
సుప్రీంలో కేసీఆర్ కు ఊరట
-
విద్యుత్ కమిషన్ జడ్జిని మార్చాలి సుప్రీంకోర్ట్ ఆదేశం
విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటీషన్‌పై ఇవాళ (మంగళవారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో ఎవరిని నియమిస్తారో చెప్పాలని ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీని సుప్రీంకోర్ట్ ధర్మాసనం కోరింది. మెరిట్స్‌పైన జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో తన అభిప్రాయాన్ని వెల్లడించడంతో ఆయనను కొనసాగించకూడదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.
కాగా విద్యుత్ కమిషన్ జడ్జిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మధ్యాహ్నం 2 గంటలకు కొత్త జడ్జి పేరును వెల్లడిస్తామన్న ప్రభుత్వ తరఫు న్యాయవాది సింఘ్వీ సుప్రీంకోర్టుకు తెలిపారు.