Friday, February 28, 2025

మైనింగ్‌ ‌రంగంలో విశేషమైన ప్రగతి

  • గనుల విభాగంలో ఆత్మనిర్భరత కోసం కృషి
  • యాక్షన్‌ ‌విధానంతో రాష్ట్రాలకు రూ 4.15 లక్షల కోట్ల లబ్ధి: కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి

పదేళ్లుగా మోదీ నాయకత్వంతో మైనింగ్‌ ‌రంగంలో విశేషమైన ప్రగతి సాధిస్తున్నామని, ఈ రంగంలో తీసుకున్న సంస్కరణల కారణంగా.. ఎక్స్‌ప్లొరేషన్‌ ‌ప్రకియను కూడా వేగవంతం చేశామని కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి అన్నారు. మైనింగ్‌ ‌సెక్టార్‌లో ఆత్మనిర్భరత సాధించేందుకు ‘ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌’‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామని వెల్లడించారు.  మైనింగ్‌ ‌మినిస్ట్రీపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..  ఎంఎండిఆర్‌ (‌మైన్స్ అం‌డ్‌ ‌మినరల్‌ ‌డెవలప్‌మెంట్‌ అం‌డ్‌ ‌రెగ్యులేషన్‌) ‌యాక్ట్-2023 ‌లోనూ సంస్కరణలు తీసుకొచ్చాం. దీని ద్వారా ఎక్స్ ‌ప్లొరేషన్‌ ‌లైసెన్స్ ‌ప్రొవిజన్స్ ‌ను అమలు చేస్తున్నామని, క్రిటికల్‌ ‌మినరల్స్ ‌యావరేజ్‌ ‌సేల్‌ ‌ప్రైస్‌ ‌ను మూల్యాంకనం చేసేందుకు ప్రత్యేక మెథడాలజీ రూపకల్పన పైన దృష్టి సారించాం.

ఆఫ్‌ ‌షోర్‌ ‌మినరల్‌ ‌బ్లాక్స్ ‌కు తొలిసారిగా వేలం వేసే ప్రక్రియను వేగవంతం చేశాం. బ్లూ ఎకానమీకి ప్రోత్సాహం కల్పించేందుకు ఆఫ్‌ ‌షోర్‌ ‌మినరల్‌ (‌డెవలప్మెంట్‌ అం‌డ్‌ ‌రెగ్యులేషన్‌) ‌యాక్ట్ 2002 ‌లో సవరణలు తీసుకొచ్చా. 12 క్రిటికల్‌ ‌మినరల్స్, ఆఫ్‌ ‌షోర్‌ ‌మినరల్స్.. ‌లైమ్‌స్టోన్‌, ‌డోలమైట్‌, ‌పాలీమెటాలిక్‌ ‌నాడ్యూల్స్ ‌మొదలైన మినరల్స్ ‌రాయల్టీ రేట్స్ ‌ను రేషనలైజ్‌ ‌చేశామని తెలిపారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి.. మైనింగ్‌ ‌పూర్తయిన ప్రాంతాల్లో మైనింగ్‌ ‌వేస్ట్ ‌డంపింగ్‌ ‌కోసం వినియోగించుకునేలా చర్యలు చేపట్టాం. 2024-25లో ఎక్స్ ‌ప్లొరేషన్‌ ‌ప్రాజెక్టస్ ‌పనులను వేగవంతం చేశాం. జియోలాజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా ఈ సంవత్సరం 448 ఎక్స్ ‌ప్లొరేషన్‌ ‌ప్రాజెక్టస్ ‌టేకప్‌ ‌చేసింది. ఇందులో 195 క్రిటికల్‌ ‌మినరల్స్ ‌ప్రాజెక్టస్ ఉన్నాయి.

గత రెండేళ్లలో జిఎస్‌ఐ 450 ఎక్స్‌ప్లొరేషన్‌ ‌ప్రాజెక్ట్ ‌చేసింది.ఎక్స్‌ప్లొరేషన్స్ ‌ను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు.. హెలిబోర్న్, ‌జియోఫిజికల్‌ ‌సర్వే, ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్, ‌మెషీన్‌ ‌లర్నింగ్‌ ‌టూల్స్, ‌డ్రోన్స్ ‌వంటి అడ్వాన్స్ ‌డ్‌ ‌టెక్నాలజీస్‌ ‌ను ఉపయోగిస్తున్నామన్నారు. జనవరి, 2024 నుంచి జనవరి 2025 వరకు మొత్తం 146 ఎక్స్ ‌ప్లోరేషన్‌ ‌ప్రాజెక్టస్ ‌కోసం రూ.712 కోట్లను నేషనల్‌ ‌మినరల్‌ ఎక్స్ ‌ప్లొరేషన్‌ ‌ట్రస్ట్  ‌ద్వారా ఫండింగ్‌ ‌చేశాం. ఇందులో ప్రైవేట్‌  ఏజెన్సీస్‌ ‌కు 48 ప్రాజెక్టస్ ‌కోసం ఆర్థికసాయం అందించాం. ఇందులో 29 క్రిటికల్‌ ‌మినరల్‌ ‌ప్రాజెక్టస్ ఉన్నాయన్నారు.  జనవరి 2024 లో 35 ఆఫ్‌ ‌షోర్‌ ‌మినరల్‌ ‌బ్లాక్స్ ‌కు సంబంధించిన రిపోర్ట్ ‌సిద్ధమైది. దీని ఆధారంగా.. 28 నవంబర్‌, 2024 ‌నాడు 13 ఆఫ్‌ ‌షోర్‌ ‌మినరల్‌ ‌బ్లాక్స్ ‌మొదటి విడతగా వేలం వేశాం. ఇందులో కన్‌‌స్ట్రక్షన్‌ ‌శాండ్‌, ‌లైమ్‌మడ్‌ ‌తోపాటుగా కోబాల్ట్, ‌నికెల్‌, ‌పాలిమెటాలిక్‌ ‌నాడ్యూల్స్ ‌వంటి క్రిటికల్‌ ‌మినరల్‌ ‌కూడా ఉన్నాయి. సెంట్రల్‌ ‌గవర్నమెంట్‌, ‌స్టేట్‌ ‌గవర్నమెంట్స్ ‌కలిసి 335 మినరల్‌ ‌బ్లాక్స్ ‌వేలానికి సిద్ధం చేశాయి. ఇందులో 106 బ్లాక్స్ ‌వేలం పూర్తయింది. 1 జనవరి 2024 నాడు 27 బ్లాక్స్ ‌కు సంబంధించిన  లీజ్‌ ‌డీడ్స్ ఇచ్చేశాం. 8 బ్లాక్స్ ‌లో మినరల్‌ ‌ప్రొడక్షన్‌ ‌కూడా ప్రారంభమైంది.

తెలంగాణ, బిహార్‌, అరుణాచల్‌‌ప్రదేశ్‌ ‌రాష్ట్రాల్లో మొదటిసారి మినరల్‌ ‌బ్లాక్స్ ‌వేలం ప్రారంభమైంది.
ఇవాళ భారతదేశపు మినరల్‌ ఆక్షన్‌ ‌మ్యాప్‌ ‌లో మొత్తం 14 రాష్ట్రాలు భాగస్వామ్యమయ్యాయి. అస్సాం లోనూ మినరల్‌ ‌బ్లాక్స్.. ఆక్షన్‌ ‌కోసం నోటిఫై అయ్యాయి. వీటి వేలం కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ జాబితాలో త్వరలోనే.. జమ్మూ కాశ్మీర్‌, ‌కేరళ రాష్ట్రాలు చేరబోతున్నాయి. మైనింగ్‌ ‌వేలంలో రాష్ట్రాలు చేరడం వల్ల ఈ రాష్ట్రాల్లో ఉపాధి పెరుగుతుంది,  యాక్షన్‌ ‌విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలకు మొత్తంగా.. రూ 4.15 లక్షల కోట్ల లబ్ధి చేకూరింది. రాయల్టీ రూపంలో 2.37 లక్షల కోట్లు, డిఎంఎఫ్‌ ‌ద్వారా లక్షకోట్లు, ఆక్షన్‌ ‌ప్రీమియం ద్వారా 74 వేల కోట్ల లబ్ధి చేకూరింది. డిస్ట్రిక్ట్ ‌మినరల్‌ ‌ఫండ్‌ ‌లో లక్ష కోట్లకు పైగా నిధులు జమయ్యాయి. ఈ నిధులను విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, తాగునీరు వంటి అంశాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం.

డిఎంఎఫ్‌ ‌కే ద్వారా ఇచ్చే డెవలప్‌మెంట్‌ ‌ప్రాజెక్టస్‌ను ప్రధానమంత్రి ఖనిజ్‌ ‌క్ష్రే ‌కల్యాణ్‌ ‌యోజన ద్వారా అమలు చేస్తున్నాం. డీఎంఎఫ్‌ అమలులోనూ పలు సంస్కరణలు తీసుకొచ్చాం. హౌసింగ్‌, ‌వ్యవసాయం, పశుపోషణ తదితర అంశాలను చేర్చాం.  2025 జవరిలో ఒడిశాలోని కోణార్క్ ‌లో మూడు రాష్ట్రాల మైనింగ్‌ ‌శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించాం. ఇందులో వివి రాష్ట్ర ప్రభుత్వాల మైనింగ్‌ ‌మినిస్టర్స్, ఆయా రాష్ట్రాల అధికారులతో కలిసి చర్చించాం.దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో, టెక్నలాజికల్‌ ఇన్నొవేషన్‌ ‌లో, వ్యూహాత్మక భాగస్వామ్యాలను నెలకొల్పడంలో.. మైనింగ్‌ ‌రంగ కీలకపాత్ర పోషించనుంది. అందుకే భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అందరినీ కలుపుకుని ముందుకెళ్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి వెల్లడించారు.

ప్ర‌దాన వార్త‌లు

గవర్నర్ అంటే అంత లెక్కలేనితనమా? అన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com