దివ్యాంగులను అవమానపరిచిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ను వెంటనే విధుల్లో నుంచి తొలగించి ఆమెను అరెస్ట్ చేయాలని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర్‌రావు డిమాండ్ చేశారు. బుధవారం లోయర్‌ట్యాంక్‌బండ్ లో అంబేడ్కర్ విగ్రహం వద్ద అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. స్మితా సబర్వాల్‌కు నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక నాయకులు జంగల్ శ్రీనివాస్, పి. శ్రీనివాస్, పులిపాటి శ్రీనివాస్, మల్లెల డేవిడ్, నరసింహారెడ్డి, మాధవి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.