Thursday, December 26, 2024

రెండు డీఏలు ఇస్తాం

-పెండింగ్‌పై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం
– మీకేం కావాలో చెప్పండి
– ఉద్యోగ సంఘాల‌తో సీఎం రేవంత్ భేటీ
– ఇటీవ‌ల ఉద్య‌మం చేస్తామ‌ని హెచ్చ‌రించిన ఉద్యోగ జేఏసీ

రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా పెండింగ్‌లో ఉన్న డీఏల‌పై చ‌ర్చించారు. ముందుగా రెండు డీఏల‌ను విడుద‌ల చేసేందుకు సీఎం రేవంత్ ఆమోదం చెప్పిన‌ట్లు తెలిసింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం ఐదు డీఏలు పెండింగ్ ఉన్నాయ‌ని, పీఆర్సీ రిపోర్ట్ ఇంకా రాలేద‌ని ఉద్యోగ సంఘాల జేఏసీ… సీఎంకు వివ‌రించారు.
ఇటీవ‌ల ప‌లు స‌మ‌స్య‌ల సాధ‌న కోసం ఉద్యోగ సంఘాల‌న్నీ ఏక‌మ‌య్యాయి. దాదాపు 200 అసోసియేష‌న్ల‌తో ఉద్యోగ సంఘాల జేఏసీ ఏర్పాటైంది. ఈ నేప‌థ్యంలోనే దాదాపు 51 అంశాల‌తో ఉద్య‌మ ఎజెండాను ప్ర‌క‌టించింది. దీంతో ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయింది. ఉద్యోగ సంఘాల జేఏసీతో సీఎం రేవంత్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. దీనిలో భాగంగానే గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. త్వ‌ర‌లోనే పీఆర్సీ నివేదిక‌పై ఆదేశాలు జారీ చేస్తామ‌ని సీఎం సూచించారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com