హెచ్‌సీయూలోని 400 ఎకరాల భూమికి సంబంధించి వివాదం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి రేణు దేశాయ్ దీనికి సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ భూమిని అలాగే వదిలేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె అభ్యర్థించారు. తనకు ఇప్పుడు 44 ఏళ్లు అని, రేపో మాపో చనిపోతానని… కానీ తర్వాతి తరాలకు ఆక్సిజన్, నీరు కోసం ఇలాంటి భూమి అవసరమన్నారు. అభివృద్ధి జరగాలని, దాని కోసం మరోచోట భూమిని ఉపయోగించాలని వీడియోలో ఆమె కోరారు.
ఇక తన స్నేహితులు చాలామంది ఈ వీడియో చేయవద్దని తనను కోరారని, కానీ ఒక తల్లిగా తన మనస్సాక్షి తనను ఇలా చేయమని బలవంతం చేసిందని తెలిపారు. మనం మన పిల్లలకు ఉత్తమ విద్య, మంచి ఆహారం, వారి భవిష్యత్తు కోసం చాలా డబ్బు సంపాదిస్తున్నాం. కానీ వాటన్నింటికంటే ముందు మనకు ఆక్సిజన్, నీరు అవసరమని రేణు దేశాయ్ వీడియో ద్వారా తెలిపారు.