Saturday, April 19, 2025

ఢిల్లీ వాటర్ వీక్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం

ప్రతిఏటా వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని దేశంలో నీటి వనరులను అభివృద్ది చేసుకోలాన్న లక్షంతో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నిర్వహించిన వాటర్‌వీక్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రానిక తగిన ప్రాతినిధ్యం లభించింది. న్యూ ఢిల్లీ లో జరుగుతున్న ‘8వ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ ‘ సదస్సుకు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. మంగళ వారం నాడు న్యూ ఢిల్లీ లోని భారత మండపంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న 8వ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ సదస్సు- 2024 భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభమైంది.

ఈ సదస్సు నాలుగు రోజుల పాటు కొనసాగనుంది.ఈ సదస్సులో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంత్రి సి ఆర్ పాటిల్ తో పాటు పలు దేశాల,పలు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులతో పాటు,నీటి పారుదల రంగ నిపుణులు పాల్గొన్నారు సదస్సులో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని తెలంగాణ రాష్ట్రం జల వనరుల నిర్వహణలో చేస్తున్న కృషిని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి జల సంబంధిత ఆవిష్కరణలు, ప్రాజెక్టులతో నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో తెలంగాణ ప్రాజెక్టులకు కూడా ప్రాధాన్యం లబించింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com