Friday, February 7, 2025

విసిల నియామకంలో యూజిసి పెత్తనం సరికాదు

విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతం
కేంద్రమంత్రికి కెటిఆర్‌ ‌వినతి పత్రం
ఎన్‌హెచ్‌ 365 ‌పొడిగించాలని గడ్కరీకి విన్నపం

యూజీసీ నూతన మార్గదర్శకాలపై తమ అభిప్రాయాలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు నివేదించినట్లు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌తెలిపారు. ఈ మేరకు ఆయన దిల్లీలో డియాతో మాట్లాడారు. తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు కేంద్ర మంత్రిని కలిసినట్లు చెప్పారు. రాష్ట్ర వర్సిటీల్లో సెర్చ్ ‌కమిటీల బాధ్యతను గవర్నర్‌కు అప్పగించేలా నిబంధనలు రూపొందించారన్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ‘నూతన నిబంధనల వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు నష్టం జరుగుతుంది. గవర్నర్ల ద్వారా వర్సిటీలను కేంద్రం అధీనంలోకి తీసుకోవాలనుకుంటున్నారు. యూజీసీ నిబంధనల అభ్యంతరాలపై 6 పేజీలతో నివేదిక ఇచ్చాం. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవద్దని విన్నవించామన్నారు.

రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకానికి సంబంధించిన సెర్చ్ ‌కమిటీల బాధ్యతను రాష్ట్ర గవర్నర్ల ద్వారా కేంద్రం నియంత్రించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరూద్దమన్నారు. సెర్చ్ ‌కమిటీల బాధ్యతలను గవర్నర్‌కు అప్పగించేలా నిబంధనలు రూపొందించారన్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తూ.. కొత్త నిబంధనలు రూపొందించారని.. గవర్నర్ల ద్వారా వర్సిటీలను కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకోవాలని అనుకుంటుందని ఆరోపించారు. నూతన నిబంధనలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. యూజీసీ నిబంధనలపై అభ్యంతరాలను ఆరు పేజీలతో నివేదిక కేంద్రమంత్రికి ఇచ్చినట్లు వివరించారు. నిబంధనలను సవరించాలని మంత్రిని కోరామన్నారు. ఇలా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవద్దని చెప్పామన్నారు.

అలాగే, జాతీయ రహదారి 365బీని పొడిగించాలని కేంద్రమంత్రి నితిన్‌ ‌గడ్కరీని కోరామన్నారు. ఎన్‌హెచ్‌-365‌బి రహదారిని పొడిగించాలని కేంద్రమంత్రి నితిన్‌ ‌గడ్కరీని కోరామని కేటీఆర్‌ ‌తెలిపారు. కెటిఆర్‌ ‌నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ‌నేతల బృందం దిల్లీలో కేంద్రమంత్రులను కలిసింది. యూజీసీ ముసాయిదా నిబంధనలపై కేంద్రానికి బీఆర్‌ఎస్‌ ‌నేతలు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వినతిపత్రం సమర్పించింది. ఆ తర్వాత 365బీ జాతీయ రహదారిని సూర్యాపేట-సిరిసిల్ల రహదారిని కోరుట్ల వరకు విస్తరించాలంటూ నితిన్‌ ‌గడ్కరీని కోరామన్నారు.. ఇక పార్టీ పిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందేనన్నారు. అనర్హత వేటు పిటిషన్లపై న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com