సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్, సభ్యులు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. సిఎంను కలిసిన వారిలో ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, సభ్యులు ప్రదీప్‌కుమార్ రెడ్డి పల్లె, రిటైర్డ్ ఐఏఎస్ చిత్రా రాంచంద్రన్‌లు ఉన్నారు.
ఈ సందర్భంగా రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సిఎం రేవంత్ వారికి సూచించారు. రెరా చట్టం ద్వారా కొనుగోలుదారులకు భరోసా కల్పించాలని సిఎం వారితో పేర్కొన్నారు.