Wednesday, January 8, 2025

రెరా చైర్మన్, సభ్యులను తొలిగించాలి

రెండేండ్ల వేతనాలను రికవరీ చేయండి

తెలంగాణ రెరా కమిటీని వెంటనే తొలిగించాలని, రెరా చట్టం 2016 ప్రకారం వారి నియామకం చెల్లదని సామాజిక కార్యకర్త, కాంగ్రెస్‌ పార్టీ సభ్యురాలు లుబ్నా సర్వతి డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా చట్టం ప్రకారం నియామకాలు చేయాలని సూచిస్తూ సీఎం రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు. రెరా చట్టం నిబంధనలు పాటించకుండా రెరా చైర్మన్‌ సత్యనారాయణ, సభ్యులు లక్ష్మీ నారాయణ, శ్రీనివాసరావును నియమించారని లేఖలో పేర్కొన్నారు. ఎంపిక కమిటీకి సంబంధించిన విధివిధానాలు లేవని, అప్పటి ప్రభుత్వం చేసిన నియామకాలు అంతా తప్పు అని వివరించారు. ఇవన్నీ మోసపూరిత నియామకాలుగా గుర్తించాలని లేఖలో కోరారు. 2023, జూన్‌ నుంచి వారికి ఇస్తున్న వేతనాలను రికవరీ చేయాలని సీఎంను కోరారు. రిటైర్డ్‌ జడ్జి, సీఎస్‌ హోదాలో పని చేసి పదవీ విరమణ చేసిన వారిని నియమించాల్సి ఉండగా. కేవలం కలెక్టర్‌గా, కమిషనర్‌ గా పని చేసి రిటైరైన వారిని చైర్మన్‌గా నియమించడం నిబంధనలకు విరుద్ధమని లేఖలోప్రస్తావించారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com