Sunday, May 11, 2025

రియల్ ఎస్టేట్ కంపెనీలకు ‘రెరా’ షోకాజ్ నోటీసులు

సోనెస్టా ఇన్ఫినిటీ, హస్తిన రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు నోటీసులు
రెరా రిజిస్ట్రేషన్ పొందకుండానే బ్రోచర్ విడుదల చేశారని ఆరోపణ
వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు

రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలకు ‘రెరా’ అథారిటీ అధికారులు మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సోనెస్టా ఇన్ఫినిటీ, హస్తిన రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. సోనెస్టా ఇన్ఫినిటీ ప్రమోటర్ గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి వెనుక జయభేరి పైన్ కాలనీలో స్కైవిల్లాస్ నిర్మాణాలకు రెరా రిజిస్ట్రేషన్ పొందకుండానే సోషల్ మీడియా ద్వారా బ్రోచర్ విడుదల చేసింది. హస్తిన రియాల్టీ ప్రమోటర్స్ ‘బ్రిస్సా’ ప్రాజెక్టు పేరుతో బ్రోచర్ విడుదల చేసి కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం రెరా దృష్టికి రావడంతో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ సంస్థలను ఆదేశించింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com