Thursday, December 12, 2024

మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వలేము

కీలక తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు

మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వలేము అంటూ పశ్చిమ బెంగాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. వర్గాల వెనుకబాటు ప్రాతిపదికన మాత్రమే రిజర్వేషన్లు మంజూరు చేయడం కరెక్ట్ అంటూ వ్యాఖ్యానించింది. మతం బట్టి రిజర్వేషన్లు ఇవ్వలేమని, ఓబీసీని రద్దు చేస్తూ కోలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనికి సంబంధించిన పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది.

దీనిపై విచారణ చేసిన ధర్మాసనం కోలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. మతాల ప్రాతిపదికన రిజర్వేషన్లను ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు మతాల ఆధారంగా ఇవ్వలేదని, వెనుకబాటుతనం ఆధారంగా ఇస్తున్నారని Justice Gawai జస్టిస్ గవాయ్ చెప్పారు. ఈ విచారణలో పశ్చిమబెంగాల్ తరుఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదిస్తే… ప్రతివాదుల తరుఫున మర సీనియర్ న్యాయవాది సీఎస్ పట్వాలియా వాదించారు.

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular