టీఎస్ న్యూస్ :
తమిళిసై సౌందర రాజన్ తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆమె రాజీనామా లేఖను పంపారు. ఇవాళ ఆమె ఆమోదించారు. ఏడాది నుంచి క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్లేందుకు తమిళిసై ప్రయత్నిస్తున్నారు. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షు రాలిగానూ తమిళిసై పనిచేశారు. అప్పుడు సెంట్రల్ చెన్నయ్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి అక్కడి నుంచే పోటీ చేయలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. గవర్నర్ గా వ్యవహరించిన సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో సఖ్యత కొనసాగలేదు. గత ప్రభుత్వం ఆమెకు ప్రొటోకాల్ పాటించకపోవడం, గౌరవించకపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ గవర్నర్ మెంటు కొలువు దీరిన తర్వాత ఆమె సఖ్యతతో కొనసాగుతున్నారు. ఈ తరుణంలో ఆమె రాజీనామా చేయడం గమనార్హం.