‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో సడెన్‌గా ఫేమస్ అయిపోయిన చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమాల (బుల్లిరాజు). ఈ చిత్రంలో బుల్లిరాజు పాత్రలో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం మన బుల్లిరాజుకు చిక్కులు వచ్చాయి. అదేంటి అనుకుంటున్నారా… రేవంత్ భీమాల పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సృష్టించి తప్పుడు ప్రచారాలు జరుగుతుండటంపై రేవంత్ తండ్రి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్ని రోజులుగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తమ కుమారుడి పేరు మీద ఫేక్ అకౌంట్లు సృష్టించి ఒక సినిమా ప్రచారం కోసం చేసిన వీడియోలను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని శ్రీనివాసరావు అన్నారు. ఫేక్ అకౌంట్ల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు. తమ కుమారుడికి ఇటువంటి వివాదాలు, రాజకీయాలతో ముడిపెట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.