Wednesday, November 27, 2024

ఇథనాల్‌ రద్దు రేవంత్‌ సర్కారు నిర్ణయం..?

రోజు రోజుకూ వివాదాస్పదమవుతున్న ఇథనాల్‌ పరిశ్రమ రద్దు చేయాలని రేవంత్‌ సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది కూడా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. ఇందులో ఓ మాజీ మంత్రికి సంంధించిన వాటాధనం కూడా ఉంది. అయితే, ఇటీవల లగచర్ల ఘటనతో ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో దిలావర్‌పూర్‌ లో కూడా రైతులు, గ్రామాల ప్రజలు తిరుగబడుతుండటంతో.. సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రైతుల ఆందోళన నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.

పరిశీలనలో ప్రభుత్వం
నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ పరిశ్రమ అనుమతులను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతులు పునఃసమీక్షించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే ఇథనాల్‌ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు సమాచారం.
నిజానికి, ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నది మాజీ మంత్రి తలసాని కుటుంబమే. దీనికి అనుమతులు కూడా గత ప్రభుత్వమే మంజూరు చేసింది. ఈ కంపెనీకి తొలుత డైరెక్టర్లుగా తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమారుడు తలసాని సాయి కిరణ్‌, వాళ్ల బంధువు పుట్టా మహేశ్‌ యాదవ్‌ తదితరులున్నారు. వీరి ఆధీనంలో ఉన్న కంపెనీ PMK Distillations. బీఆర్ఎస్ హయాంలో దిలావర్ పూర్ లో ఇథనాల్ కంపెనీకి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ PMK Distillations కంపెనీ ఆధ్వర్యంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు అవుతున్నది. ఇదే కంపెనీలో గతంలో డైరెక్టర్లుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు తలసాని సాయి కిరణ్, తలసాని బంధువు, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తదితరులు వ్యవహరించారు. అందుకే ఈ కంపెనీ విషయంలో బీఆర్‌ఎస్‌ మాట జారడం లేదు.

కలెక్టర్‌ ఏం చెప్పారంటే.?
తాజాగా దిలావర్‌పూర్‌ గ్రామస్థులతో కలెక్టర్‌ అభినవ్‌ చర్చలు జరిపారు. అధికారులపై దాడి ఘటనపై కలెక్టర్‌.. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు వెల్లడించారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు గ్రామస్థులకు కలెక్టర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇథనాల్‌ పరిశ్రమ సర్వే పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చారు. దీంతో గ్రామస్థులు ఆందోళనను కాస్త తగ్గించారు. కాగా ఏ క్షణమైన ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీని నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసులపై రాళ్ల దాడి..!
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పనులు చకచకా జరుగుతున్నాయి. కాగా తమకు ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు అంటూ గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. మొత్తం నాలుగు గ్రామాల ప్రజలు ఆ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. తాజాగా ఆందోళనలను ఉదృతం చేశారు. తాజాగా ఆర్డీవో రత్న కళ్యాణి వచ్చి ఆందోళన విరమించాలని రైతులను కోరగా.. ఆమెను దాదాపు ఆరు గంటలు పైగా రైతులు నిర్బంధించారు. వివాదం పెరుగుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఇథనాల్‌ రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular