Saturday, September 14, 2024

హైడ్రా పరిధికి ఓర్ఆర్ఆర్​ పరిధి ప్రభుత్వ భూములు

  • హైడ్రా పరిధికి ఓర్ఆర్ఆర్​ పరిధి ప్రభుత్వ భూములు
  • ప్రభుత్వ స్థలాల పరిరక్షణను హైడ్రాకు అప్పగించేందుకు విధివిధానాలు

ఓఆర్​ఆర్​ పరిధిలో జలాశయాలు, ప్రభుత్వ ఆస్తుల కబ్జాల తొలగింపు ప్రక్రియ పూర్తిగా హైడ్రా పరిధిలోకి తీసుకు రానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నోటీసులు కూడా హైడ్రానే జారీ చేసేలా విధి విధానాలు తయారు చేయాలని పురపాలక శాఖను​ ఆదేశించారు. హైడ్రాను బలోపేతం చేసేందుకు పోలీసులు, ఇతర సిబ్బందిని త్వరలో కేటాయించనున్నట్ల చెప్పారు, ఆక్రమణల తొలగింపు ప్రక్రియలో నిబంధనలను కచ్చితంగా పాటించాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు వివిధ శాఖల అధికారులతో సీఎస్​ సమావేశం నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రాకు మరిన్ని అధికారాలను, సిబ్బందిని అప్పగించేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు. కూల్చివేతలపై రెవెన్యూ, జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ, ఇరిగేషన్​, తదితర వేర్వేరు శాఖలు నోటీసులు ఇవ్వడంతో గందరగోళం తలెత్తుతోందని సీఎస్​ పేర్కొన్నారు. ఓఆర్​ఆర్​ పరిధిలోని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను పూర్తిస్థాయిలో హైడ్రాకు అప్పగించేందుకు విధివిధానాలను రూపొందించాలన్నారు. ఎఫ్​టీఎల్​, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పూర్తిగా హైడ్రాకు అప్పగిస్తామని సీఎస్​ శాంతి కుమారి తెలిపారు. ప్రస్తుతం జలమండలి పరిధిలో ఉన్న గండిపేట, హిమాయత్​ సాగర్​ చెరువుల పరిరక్షణ బాధ్యత కూడా హైడ్రా పరిధిలోకి తీసుకొస్తామని అన్నారు. హైడ్రా ఆధ్వర్యంలో ఏర్పాటైన 72 బృందాలను మరింత బలోపేతం చేయడానికి పోలీసు, సర్వే, ఇరిగేషన్​ తదితర శాఖలకు అవసరమైన సిబ్బందిని కేటాయించనున్నట్లు చెప్పారు.

చిక్కులు రావద్దు

కూల్చివేత‌ల‌పై తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యల నేప‌థ్యంలో అధికారుల‌తో.. సీఎస్​స‌మీక్షించారు. చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై గత కొన్ని రోజులుగా రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఈ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ స‌మీక్షలో భాగంగా ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను పూర్తి స్థాయిలో హైడ్రాకు అప్పగించేందుకు విధివిధానాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణంలోకి తీసుకుంటూ, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకై హైడ్రాకు మరిన్ని అధికారాలను, సిబ్బందిని అప్పగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు.ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపుపై ప్రస్తుతం నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ, పురపాలక శాఖ, పంచాయితీ రాజ్, వాల్టా తదితర విభాగాలు వేర్వేరుగా నోటీసులు జారీ చేస్తున్నారని, దీనివల్ల ఒకరకమైన కన్ఫ్యూజన్ ఏర్పడుతోందని అభిప్రాయపడ్డారు.

దీనిని నివారించటానికి, ఓఆర్ఆర్ పరిధిలో అన్ని విధాలా ఆక్రమణల తొలగింపు నోటీసులను హైడ్రా ద్వారానే చేపట్టేందుకు విధి విధానాలు ఖరారు చేయాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, ల్యాండ్ ఏంక్రోచ్మెంట్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, వాల్టా చట్టం, నీటిపారుదల శాఖ చట్టాల ద్వారా జారీ చేసే అన్ని రకాల నోటీసులు, తొలగింపులన్నీ పూర్తిగా ఒకే విభాగం హైడ్రా పరిధిలోకి తేనున్నట్టు వివరించారు. హైడ్రాకు కావాల్సిన అదనపు అధికారులు, సిబ్బందిని త్వరలోనే కేటాయించనున్నట్టు తెలిపారు. ఎఫ్‌టీఎల్‌, నాలా ఎంక్రోచ్‌మెంట్, ప్రభుత్వ ఖాళీస్థలాలు, పార్కుల పరిరక్షణలను హైడ్రా పరిధిలోకి తెస్తామ‌ని చెప్పారు. గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ కూడా జల మండలి నుండి హైడ్రా పరిధిలోకి తీసుకువ‌స్తున్నామని వెల్లడించారు. హైడ్రా ఆధ్వర్యంలో మొత్తం 72 బృందాలు ఏర్పాటయ్యాయని, వీటిని మరింత బలోపేతం చేయాడానికి కావాల్సిన పోలీస్, సర్వే, నీటిపారుదల శాఖల నుండి అధికారులు, సిబ్బందిని త్వరితగతిన కేటాయించనున్నట్టు సీఎస్ తెలిపారు.

ఈ సమావేశానికి ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ మహేష్ భగవత్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, హెచ్ఎండీఏ కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి, ఏసీబీ డైరెక్టర్ తరణ్ జోషి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular