ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్రం పరిధిలో ఉన్నందున కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో, నిబద్ధతతో ముందుకు సాగుతుందని, దానికి కావాల్సిన సహకారం అందిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏఐసిసి సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే డా.సంపత్ కుమార్, టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రటరీ డా. చారకొండ వెంకటేష్‌లు సిఎం రేవంత్‌రెడ్డితో సోమవారం భేటీ అయ్యారు.
ALSO READ: వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్‌లు ఇవ్వడంపై పార్టీ కేడర్‌లో అసంతృప్తి
వీరు గంటపాటు ముఖ్యమంత్రితో పలు అంశాలపై చర్చించారు. అందులో భాగంగా వందరోజుల పరిపాలనలో ప్రభుత్వంలో నియమించిన అన్ని నియమకాలు, సామాజిక న్యాయంతో కూడుకుందని సిఎం వారితో పేర్కొన్నారు. అతి ముఖ్యంగా మాదిగల అభివృద్ధి, సంక్షేమం, వారి భవిష్యత్ తన బాధ్యత అని సిఎం వారికి హామీనిచ్చారు.