Wednesday, December 25, 2024

‌ప్రజల ఆకాంక్షలకు, సంస్కృతికి ప్రతిరూపం

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. డిసెంబర్‌ 9 ‌తెలంగాణకు పర్వదినమని, 2009లో అదే రోజు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన వొచ్చిందని గుర్తు చేశారు. శాసనసభ సమావేశాల ప్రారంభంలో ఆయన సభలో తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై మాట్లాడారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారన్నారు. సోనియా లేకుంటే తెలంగాణ ఏర్పాటు అయ్యేదా అని అన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశారని చెప్పారు. ‘నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ అన్న దాశరథి మాటలు నిత్యసత్యమని పేర్కొన్నారు అందుకే ఇకముందు డిసెంబర్‌ 9‌న తెలంగాణ ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రతి ఏడాది డిసెంబర్‌ 9‌న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహిస్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 10:30 గంటలకు శాసనసభ, శాసన మండలి ఉభయ సభలు మొదలయ్యాయి. తొలి రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.

తెలంగాణ తల్లిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పి కొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 
అన్నారు. ‘తెలంగాణ తల్లి వేరు, దేవత వేరు. ఏ తల్లికి కిరీటం ఉండదు. దేవతలకు మాత్రమే కిరీటం ఉంటుంది..ప్రభుత్వం ఆవిష్కరిస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహాన్ని. తెలంగాణ గ్రామ దేవత పోచమ్మకు కిరీటం ఉంటుందా. ఈ విషయాన్ని జనాలకు వివరించాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తల్లిపై చర్చకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదన చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంపై అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటన చేశారు.‘సంస్కృతికి ప్రతిరూపమే తెలంగాణ తల్లి. 4 కోట్ల ప్రజలను ఏకం చేసి నడిపించిన తల్లి తెలంగాణ తల్లి. అలాంటి తల్లి రూపాలు ఇప్పటికే జన బాహుళ్యంలో ఉన్నాయి. వాటికి ఇప్పటికీ అధికారికంగా గుర్తింపు లేదు. మన సంప్రదాయాలు, సంస్కృతి ఉట్టి పడేలా తెలంగాణ తల్లిని రూపొందించాం. చరిత్రకు దర్పంగా పీఠాన్ని రూపొందించాం. తెలంగాణ తల్లిని ఈ రోజు సచివాలయంలో ఆవిష్కరిస్తున్నాం’ అని   సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. భూ ప్రపంచంలో ఏ జాతికైనా గుర్తింపు.. ఆ జాతి అస్తిత్వమే అని చెప్పారు. అస్తిత్వానికి మూలం సంస్కృతి.. సంస్కృతికి ప్రతిరూపమే తల్లి అని వివరించారు. ‘స్వరాష్ట్ర పోరాట ప్రస్థానంలో సకల జనులను ఐక్యం చేసింది తెలంగాణ తల్లి అని,. తెలంగాణ జాతి భావనకు జీవం పోసింది. నిరంతరం చ్కెతన్యపరిచి లక్ష్యసాధన వైపు నడిపిందని గుర్తు చేశారు.  తెలంగాణ తల్లి స్వరూపానికి అధికారిక గుర్తింపు లేదు. ప్రజాపోరాటాలకు ఊపిరి పోసుకున్న మాతృమూర్తిని గౌరవించుకునేందుకు నిర్ణయించాం. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అని తెలిపారు.

తెలంగాణ తల్లి అంటే 4 కోట్ల బిడ్డల భావోద్వేగం..
తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదు.. 4 కోట్ల బిడ్డల భావోద్వేగం అని, ప్రజల మనోఫలకాల్లో నిలిచిన రూపాన్ని సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరించుకుంటున్నామని సీఎం రేవంత్‌ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుని విగ్రహానికి రూపకల్పన చేశామని ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో సంప్రదాయం, సంస్కృతులను పరిగణనలోకి తీసుకున్నాం. ప్రశాంత వదనంతో సంప్రదాయ కట్టుబొట్టుతో తీర్చిదిద్దాం. గుండుపూసలు, హారం, ముక్కుపుడకను పొందుపర్చాం. ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో పాటు చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారక్క పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి రూపకల్పన చేశాం. సంప్రదాయ పంటల్కెన వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్నలు ఆ తల్లి చేతిలో కనిపించేలా ఏర్పాటు చేశాం. చరిత్రకు దర్పణంగా నిలుచున్న విగ్రహాన్ని రూపొందించాం. ఉద్యమాలు, ఆత్మ బలిదానాలకు సంకేతంగా పీఠంలో పిడికళ్లను పొందుపరిచాం’ అని రేవంత్‌రెడ్డి వివరించారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com