Wednesday, April 2, 2025

లోక్​సభ పోరుకు కాంగ్రెస్​ తొలి టికెట్​

లోక్​సభ పోరుకు కాంగ్రెస్​ తొలి టికెట్​
పాలమూరు ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్​రెడ్డి

టీఎస్​, న్యూస్​:
వచ్చే పార్లమెంట్​ ఎన్నికలకు రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ తొలి అభ్యర్థిని ప్రకటించింది. కొడంగల్​ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్​రెడ్డి.. తాజాగా ఈ ప్రకటన చేశారు. బుధవారం రాత్రి అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతూ మహబూబ్​నగర్​ పార్లమెంట్​స్థానం నుంచి వంశీచంద్​ రెడ్డి పేరును ప్రకటించారు. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పారు. వంశీచంద్​ గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్​ టికెట్​ను ఆశించారు. కానీ, మంత్రి జూపల్లి చేరికతో.. వంశీకి బ్రేక్​ పడింది. దీంతో ఆయనకు పార్లమెంట్​ ఎన్నికల్లో టికెట్​ ఖరారు చేసినట్లు సీఎం రేవంత్​ ప్రకటించారు. ఇప్పటికే వంశీచంద్​ కూడా ఈ సెగ్మెంట్​లో ప్రచారం సైతం మొదలుపెట్టారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com