రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు. అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అమెరికాలో ఉన్న పలు గ్లోబల్ సంస్థల కార్యాలయాలను సైతం సందర్శిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గూగుల్, ఆపిల్ సంస్థల హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించారు. ఐతే ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ కు సంబందించిన ఓ అంశంపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
రేవంత్ అమెరికా బృందంలో ఉన్న వారందరు ఈ పర్యటనలో సూటూ బూటుతో కనిపిస్తుండగా.. రేవంత్ రెడ్డి మాత్రం తన నేచురల్ లుక్ లో కనిపిస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎలా ఐతే మామూలు చొక్కా, ప్యాంటుతో ఉంటారో.. అమెరికాలోను అంతే సహజంగా కనిపిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఐతే గూగుల్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించిన సమయంలో మాత్రం సరికొత్త స్టైలిష్ లుక్ లో కనిపించారు. అమెరికా టూర్ మొత్తంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఇదే హైలెట్ లుక్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు, ఆయన అభిమానులు ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.