రాంగోపాల్ వర్మ మంచి ఫ్రెండ్ అన్న ముఖ్యమంత్రి
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. హైదరాబాద్ లో జరిగిన క్షత్రియ సేవా సమితి అభినందన సభలో పాల్గొన్న సీఎం.. ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్షత్రీయుల గురించి చెబుతూ ప్రభాస్ పేరును ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్. దేశంలో పలు రంగాల అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉందన్న సీఎం.. సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తుల్లో కృష్టం రాజు ఒకరని చెప్పారు. కృష్ణంరాజు పేరు లేకుండా తెలుగు సినిమా పేరు చెప్పలేమని.. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ పేరును ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి. హాలీవుడ్ కి పోటీ ఇచ్చిన బాహుబలి సినిమాని ప్రభాస్ లేకుండా ఊహించలేమని అన్నారు. ప్రభాస్ నటనను ఎవరైనే మెచ్చుకోకుండా ఉండలేరని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఆర్జీవీ తనకు మంచి మిత్రుడని, ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ప్రభాస్ తో పాటు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి సీఎం రేవంత్ చేసి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.