Saturday, May 17, 2025

Revanth Reddy Diwali wishes: ప్రతీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గత పదేండ్ల విధ్వంసపు పాలనలోని చీకట్లు తొలగిపోయాయని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రజా పాలనలో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగను రాష్ట్రంలోని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. ఈ దీపాల కాంతులతో ప్రతి ఇంటింటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పర్యావరణానికి హాని కలిగించకుండా చిన్నా పెద్దలందరూ పండుగ జరుపుకోవాలని, ప్రమాదాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com