Thursday, December 12, 2024

రేవంత్‌రెడ్డి… ఓ బ్యాగ్‌ బాబ్జీ

  • దతెలంగాణ తల్లిని అవమానించిన దుర్మార్గుడు
  • దతెలంగాణ తల్లి విగ్రహం కాదది, అది కాంగ్రెస్‌ తల్లి విగ్రహం
  • దబిఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే మేళ తాళాలతో గాంధీభవన్‌ తరలిస్తాం
  • ద20ఏళ్ల క్రితమే తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్‌ రూపకల్పన
  • బిఆర్‌ఎస్‌ నిరసనలో ఎమ్మెల్సీ దేశపతి ఘాటు వ్యాఖ్యలు

ప్రజల బాగోగులు ఏమాత్రం పట్టని బ్యాగ్‌ బాబ్జీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంటూ కవి, గాయ కుడు, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లిని అవమానపరిచిన అత్యంత దుర్మార్గుడు రేవం త్‌రెడ్డి అని దేశపతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. మంగళవారం సిద్ధిపేటలోని అంబేడ్కర్‌ చౌరస్తాలోని మోడల్‌ బస్టాండ్‌ వద్ద కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, బతుకమ్మను తొలగించడం పట్ల బిఆర్‌ఎస్‌ పార్టీ పిలుపు మేరకు భారీ ధర్నా నిర్వహి ంచారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం, సిఎం రేవంత ్‌రెడ్డికి వ్యతిరేకంగా బిఆర్‌ఎస్‌ కార్యకర్తలు నాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ మాట్లా డుతూ.. తెలంగాణ రైతుల కష్టం, వ్యవసా యానికి, సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మను తెలంగాణతల్లి విగ్రహంలో ఏర్పాటు చేశామని తెలిపారు. 20ఏళ్ల కిందటే కేసీఆర్‌ తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేశారని, ఆ విషయం కాంగ్రెస్‌ దుర్మార్గులకు తెలియదని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు తొత్తుగా మారి తెలంగాణ రాకుండా అడ్డుపడిరది రేవంత్‌రెడ్డి కాదా? అని ప్రశ్నించారు.

కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సిఎంగా కేసీఆర్‌ అయినా నేపథ్యంలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎమ్మెల్యే లను కొనుగోలు చేసేందుకు బ్యాగ్‌ బాబ్జీగా రేవంత్‌ రెడ్డి అవతారమెత్తిన సంగతి ప్రజలకు తెలుసునన్నారు. ప్రజల బాగోగులు చూడ మంటే బ్యాగోగులు చూస్తున్న దుర్మార్గుడు రేవంత్‌ రెడ్డి అని ధ్వజమెత్తారు. సిఎం రేవం త్‌రెడ్డి సచివాలయంలో ఏర్పాటు చేసింది తెలంగాణ తల్లి విగ్రహం కాదనీ, అది కాంగ్రెస్‌ తల్లి విగ్రహం అన్నారు. చేతిలో జొన్న కర్ర పెట్టగానే తెలంగాణ తల్లి విగ్రహం కాదని గుర్తుంచుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవ ేర్చాలని మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు హరీష్‌ రావు కేటీఆర్‌లు సిఎం రేవంత్‌రెడ్డిని నిలదీ స్తుంటే అక్రమ కేసులు బనాయిస్తూ కాలం వెల్లదీస్తున్నాడని మండిపడ్డారు. బిఆర్‌ఎస్‌ పార్టీ వొచ్చాక తెలంగాణ రాష్ట్రానికి పరి మితం కాకుండా ప్రపంచంలోని అమెరికా లాంటి దేశాల్లో కూడా బతుకమ్మను ఆడు తున్నారని అందుకు గర్వంగా ఉందని చెప్పారు.

ఎన్ని కల్లో కాం గ్రెస్‌ పార్టీ అధి కారం లోకి వొస్తే బతుక మ్మకు రెండు చీరలు ఇస్తానన్న రేవంత్‌రెడ్డి హామీలు ఏమ య్యా యని ప్రశ్నించారు. రైతుబంధు గోవి ందా, రుణమాఫీ గోవిందా, బతుకమ్మ చీరలు, మహాలక్ష్మి, కల్యాణలక్ష్మి, తులం బంగారం గోవి ందా అం టూ పాటలు పాడి నిరసన తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహానికి కిరీటం ఉంటుందా? అని అంటున్న రేవంత్‌ రెడ్డి, కిరీటం పెట్టుకొని బాణం ఎక్కు పెట్టి ఫోటోలకు ఫోజులు ఇవ్వలేదా? అంటూ ఎద్దేవా చేశారు. కిరీటం ఉన్న దేవుళ్లకు రేవంత్‌ రెడ్డి మొక్కడం లేదా? అని ప్రశ్నిం చారు. తెలంగాణ తల్లి ముమ్మాటికీ మాకు అందరికీ దేవత అని చెప్పారు. బతుకమ్మతో పాటు తెలంగాణ మహిళలను అవమా నించేలా వారి మనోభావాలను దెబ్బతీశాడని మండిపడ్డారు. బిఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ తల్లి విగ్రహాన్ని మేళ తాళాలు, డబ్బు చప్పులతో గాంధీభవన్‌ తరలిస్తామని తెలి పారు. ఇప్పటికే తెలంగాణ ద్రోహిగా మిగిలిన రేవంత్‌ రెడ్డి సంస్కృతి, సాంప్ర దాయానికి మోసం చేశాడన్నారు. బతుక మ్మను తీసేసిన నిన్ను చరిత్ర క్షమిం చదన్నారు. తెలంగాణ తల్లి మాది, కాంగ్రెస్‌ తల్లి మీదా అంటూ నినదీస్తూ హోరెత్తి ంచారు.

బతుకమ్మ ఆడిన మహిళలు…
తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను తొలగించడం పట్ల మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్ధిపేట జిల్లా పరిషత్‌ తాజా మాజీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, మునిసిపల్‌ ఛ్కెర్‌పర్సన్‌ మంజుల రాజనర్సు, మాజీ ఎంపిపి శ్రీదేవి, పట్టణ కౌన్సిలర్లు, మహిళా నాయకుల ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మఆడినిరసన వ్యక్తం చేశారు. బతకమ్మ చీరలు బంద్‌ చేసావ్‌, ఇప్పుడు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను తీసే సావ్‌..ఇదేనామార్పుఅంటే మహిళల తలరాత మార్చాల్సింది పోయి, మహిళల ఔన్నత్యాన్ని అగౌరవ పరుస్తూ దెబ్బతిస్తున్నావ్‌ అని మండ పిడ్డారు. మహిళా లోకం ఉసురు తలగుతు ందన్నారు. బతుకమ్మ ఆటపాటలతో ఉద్యమ సందర్భాల మాదిరిగా నిరసన వ్యక్తం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular