Wednesday, January 1, 2025

ఎంఐఎం సపోర్ట్​..? ఆశలు పెట్టుకున్న రేవంత్​

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. సొంతపార్టీలో అసంతృప్తివాదులు ఉండటంతో సీఎం రేవంత్​ ప్రత్యామ్నాయ రక్షణ ఏర్పాట్లలో సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది సీనియర్లు అటు బీఆర్ఎస్​తో అంటకాగుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇలాంటి సమయంలో ఒకవేళ ప్రభుత్వానికి ఏదైనా కష్టం ఎదురైతే.. ప్రత్యామ్నాయ మద్దతు కోసం రేవంత్​ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. దీనిలో భాగంగానే మంగళవారం ఎంఐఎం ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రేటర్​ అభివృద్ధి కోసం అంటూ బయటకు చెప్తున్నా.. అంతర్గతంగా మాత్రం మద్దతుపైనే చర్చించినట్లు తెలుస్తున్నది.నిజానికి, సీఎం రేవంత్​ ఇప్పటికే ఎంఐఎంను బుట్టలో వేసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్లను కాదని అక్బరుద్దీన్​ను ప్రొటెం స్పీకర్​గా నియమించారు. దీన్ని బీజేపీ విమర్శించినా..కాంగ్రెస్​ ఏమాత్రం తగ్గలేదు.

మద్దతు ముఖ్యం
ప్రస్తుతం కాంగ్రెస్​ ప్రభుత్వానికి ఉన్న బలం 64 మంది. సీపీఎం మద్దతుతో ఉన్నది. మెజార్టీకి ఎక్కువ ఉన్న సంఖ్యాబలం ఐదుగురు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు అయినా ఇంకా అనుమానాలు వస్తూనే ఉన్నాయి. బీఆర్​ఎస్​, బీజేపీ, ఎంఐంఎ కలిసి, కాంగ్రెస్​లో కేసీఆర్​ సామాజికవర్గాన్ని బయటకు లాగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. దీనితోడు ఇటీవల రాజాసింగ్​, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్​రెడ్డి సైతం కీలకమైన విషయాలు మాట్లాడారు. కాంగ్రెస్​ప్రభుత్వం ఆరు నెలలు లేదా ఏడాదిలో కూలిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ వాఖ్యలు ఎలా ఉన్నా.. కాంగ్రెస్​లో మాత్రం కొంత ఆసక్తిని పెంచాయి. ఇదే సమయంలో రేవంత్​రెడ్డి కి వ్యతిరేకవర్గం సొంత పార్టీలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ ఏర్పాట్లకు సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతున్నది. అందుకే ఎంఐఎంను కలుపుకునేందుకు రేవంత్​ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఏడుగురు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మద్దతు అంశాలే కీలకంగా చర్చించారని టాక్​.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com