Wednesday, April 2, 2025

చంద్రబాబు ప్రమాణానికి రేవంత్ రెడ్డికి అందని ఆహ్వానం

  • కూటమి పొత్తుల వలనే ఆహ్వానం పంపలేదా?
  • బండి సంజయ్ కు ఆహ్వానం

ఎన్డీఏ కూటమి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా బీజేపీ ప్రముఖులు, ఎన్డీఏ కూటమికి చెందిన ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు హాజరుకాబోతున్నారు. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందలేదు. దీంతో తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్ ఈ విషయం చర్చనీయంశంగా మారింది. మొదట్నుంచీ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందకపోవడమేమిటని పలువురు నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి టీడీపీలోనే ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ప‌ని చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలను రేవంత్ రెడ్డి చేపట్టారు. గతేడాది డిసెంబర్ లో రేవంత్ రెడ్డి సీఎం కాగానే చంద్రబాబు ఫోన్ చేసి మరీ అభినందించారు. అనంతరం ఏపీలో జరిగిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన వెంటనే చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

రెండు రాష్ట్రాల మధ్య ఆరోగ్యక‌ర వాతావ‌రణం ఉండాల‌ని, విభ‌జ‌న చ‌ట్టాలను స్నేహ‌పూర్వక వాత‌వ‌ర‌ణం అమ‌లు చేసుకోవాల‌ని ఇరువురు అబిప్రాయాప‌డ్డారు. ఈ పరిణామాలతో తాజాగా ఏపీలో జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి హాజరవుతారని అందరు అనుకున్నారు. బుధవారం జరగనున్న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎలాంటి ఆహ్వానం అందలేదు.

కూట‌మి పొత్తుల వ‌ల్లే అహ్వానం పంపలేదా?
సాధారణంగా ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాల‌ కార్యక్రమాలకు ప‌క్క రాష్ట్రాల సీఎంలను పిల‌వ‌డం అనావాయితీ. గ‌తంలో ఏపీ సీఎంగా వైఎస్ జ‌గ‌న్ ప్రమాణ స్వీకారం చేసిన‌ప్పుడు తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ హ‌జ‌ర‌య్యారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ లో కీలక భాగస్వామిగా ఉండ‌టం, తెలంగాణలో ఇండియా కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ అధికారంలో ఉండ‌టంతో సీఎం రేవంత్ ను ఆహ్వానించలేదని తెలుస్తోంది.

ఇక అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్ర‌మానికి వ‌స్తుండ‌టంతో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఇండియా కూట‌మి నేతలు వేదికను పంచుకోవ‌డం ఇబ్బందిగా మారే అవ‌కాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి ఏపీ సర్కార్ ఆహ్వానం పంప‌క‌పోవ‌డానికి కార‌ణమై ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరుకానున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com