Thursday, September 19, 2024

అన్నం పెట్టే రైతును అప్పుల ఊబి నుంచి బయటకు…

  • ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే బృహత్తర సాహసమే రైతు రుణమాఫీ పథకం
  • ఎక్స్‌లో పోస్టు చేసిన సిఎం రేవంత్‌రెడ్డి

అన్నం పెట్టే రైతును అప్పుల ఊబి నుంచి ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే బృహత్తర సాహసమే రైతు రుణమాఫీ పథకమని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నాడు మన్మోహన్ సింగ్ సారథ్యంలో దేశ రైతాంగానికి ఘనత కాంగ్రెస్ పార్టీదేనని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం పాలనలో తెలంగాణ రైతాంగానికి, కష్టమైనా భారమైనా ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి, ఆగష్టు 15వ తేదీ లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. ప్రజా ప్రభుత్వంలోని ప్రతి నిర్ణయంలో రైతు సంక్షేమ కోణం ఉంటుందని, ఇది రైతన్నకు మీ రేవంతన్న మాట అంటూ సిఎం రేవంత్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular