Tuesday, April 1, 2025

హైదరాబాద్​ను కేసీఆర్​ డెవలప్​ చేశారు

హైదరాబాద్​ను కేసీఆర్​ డెవలప్​ చేశారు
హాట్​టాపిక్​గా మారిన సీఎం రేవంత్​ వ్యాఖ్యలు

టీఎస్​, న్యూస్​:
రాజకీయాలు ఎలా ఉన్నా మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను అభివృద్ధి చేశార‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కంటే ముందున్న ముఖ్యమంత్రులు వైఎస్, చంద్రబాబు కూడా హైద‌రాబాద్‌ను డెవ‌ల‌ప్ చేశార‌ని తెలిపారు. హోటల్ వెస్టిన్‌లో సీఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో విద్య, నైపుణ్యాభివృద్ధి – వ్యవస్థాపక అవకాశాలు అంశంపై నిర్వహించిన స‌మావేశంలో రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్​ టాపిక్​గా మారాయి. వీటిపై సోషల్​ మీడియాలో కూడా వివిధ రకాలుగా కామెంట్స్​ వస్తున్నాయి.
కేసీఆర్​పై ఇటీవల పదేపదే విరుచుకుపడుతున్న సీఎం రేవంత్​రెడ్డి.. సీఎం హోదాలో తొలిసారిగా కేసీఆర్​ గురించి పాజిటివ్​గా మాట్లాడారు. అయితే, కేసీఆర్​ హైదరాబాద్​ను డెవలప్​ చేశారని చెబుతూనే.. సీఎం గురు సమానులుగా భావించే ఏపీ మాజీ సీఎం చంద్రబాబును సైతం గుర్తుకు చేసుకున్నారు. చంద్రబాబు గురించి చెప్పేందుకే కేసీఆర్​ ప్రస్తావన తీసుకువచ్చారని సోషల్​ మీడియాలో వైరల్​ అవుతుంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com