Thursday, December 26, 2024

Revanth Vs KTR సభా పర్వం ఐదో రోజూ రభస ..

అసెంబ్లీలో కాంగ్రెస్​ వర్సెస్​ బీఆర్​ఎస్​

అసెంబ్లీ సమావేశాల ఐదో రోజూ శాసనసభ అట్టుడికింది. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య వాదోపవాదాలతో హీటెక్కింది. బుధవారం ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో శాసనసభ మొదలైంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భూభారతి బిల్లుపై చర్చతో పాటు తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు, గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాంతో పాటు ప్రభుత్వ అప్పులు, చెల్లింపులపై సహా రైతు భరోసాపై చర్చ జరిపింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులపై బీఆర్​ఎస్​ సభ్యులు నిరసన తెలిపారు.కీలక బిల్లులకు ఆమోదం తెలిపే ముందు వాటిపై చర్చకు సమయ ఇవ్వాలని పట్టుబట్టారు.శాసనసభ నడుపుతున్న తీరుపై అసహనం వ్యక్తం చేసిన విపక్షాలు.. సభా కార్యకలాపాలపై సభ్యులకు సరిగ్గా సమాచారం ఇవ్వట్లేదని దుయ్యబట్టారు. శాసనసభను నిర్వహిస్తున్న ప్రభుత్వ తీరు ఇది కాదని హరీశ్‌రావు, అక్బరొద్దీన్​ ఓవైసీ మండిపడ్డారు. సమాచారం లేకుండా చట్టాలపై ఏం మాట్లాడాలని బీజేపీ పక్షనేత నేత ఏలేటి మహేశ్​వర్​ రెడ్డి నిలదీశారు. అయితే స్పీకర్ క్షమాపణలు చెప్పాలని కొందరు డిమాండ్ చేయడంతో మంత్రి శ్రీధర్ బాబు గట్టిగా అరిచారు.

దీంతో అసెంబ్లీలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత పరిస్థితులు సద్దుమణిగి మళ్లీ చర్చ ప్రారంభమైంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్.. స్పీకర్​ గడ్డం ప్రసాద్ కుమార్​ కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. శాసనసభ్యుల హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించారని ఆ నోటీసులో పేర్కొంది. సభ ఆమోదం పొందని భూ భారతి బిల్లును చట్టంగా ఎలా ప్రకటిస్తారని నిలదీసిన బీఆర్‌ఎస్‌ సభ్యులు ఎలాంటి చర్చలు లేకుండానే కీలక చట్టాల అమలుపై ప్రకటిస్తూ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. శాసనసభ గౌరవానికి దెబ్బతీసిందని బీఆర్ఎస్ సభ్యులు అరోపించారు. భారత రాజ్యాంగ ఆర్టికల్ 245 ప్రకారం సభా హక్కులకు హాని కల్గించారంటూ స్పీకర్​ కు వినతి పత్రం అందజేసింది.

అలాగే అధికార, విపక్ష సభ్యుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. అంతకు ముందు కీలక బిల్లులకు ఆమోద ముద్ర, భూభారతిపై చర్చ నేపథ్యంలో గంట ముందుగానే అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్​ రెడ్డి..అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరు, కీలకాంశాలపై సభ్యులకు దిశానిర్దేశం చేశారు. సభ ప్రారంభంలో ప్రసంగించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి.. సభలో ప్రతిపక్ష నేత కేసీఆర్​ కనబడడం లేదని సెటైర్లు వేశారు. సభలో ప్రతిపక్ష నేత కేసీఆరా.. హరీశ్ రావా..? అని ప్రశ్నించారు. ఇటు బీజేపీ నేతలు అసెంబ్లీకి ఎడ్లబండిపై వచ్చి నిరసన తెలిపారు. కాగా గత ప్రభుత్వ హయాంలో సీఎం సలహదారుల నియామకాన్ని తప్పుబట్టిన రేవంత్​ రెడ్డి స్వయంగా తానే సలహాదారులను నియమించుకోవడాన్ని నిరసిస్తూ.. బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీలు శాసనమండలి నుంచి వాకౌట్​ చేశారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత తిరిగి సభలో పాల్గొన్నారు.

జీవో 317 సమస్యలు పరిష్కరించాలి: మండలిలో ఎమ్మెల్సీ కవిత

317జీవోపై శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి శ్రీధర్ బాబు మధ్య ఆసక్తికర చర్చ సాగింది. 317జీవో సమస్యలపై ఎమ్మెల్సీలు కోదండరాం, తీన్మార్ మల్లన్న, కవిత, జీవన్ రెడ్డి, ఏవీఎన్ రెడి, వాణిలు వివరించారు. కవిత మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన జీవో 317 లో సమస్యలు ఉన్నాయంటున్న ప్రభుత్వం వాటిని పరిష్కరించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 317 జీవో తెచ్చుకున్నామన్న ఆమె 317 జీవో వల్ల సమస్యలు ఉన్నాయి అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారన్నారు. వాటిలో సమస్యలుంటే అధికారంలోకి వచ్చిన మీరు పరిష్కరించకుండా ఇంకా మాపై నిందలెందుకని ప్రశ్నించారు. 317జీవోను ఆనాడు విమర్శించిన కోదండరాం ఇప్పుడు రెండు మూడు జిల్లాలకు ఎఫెక్టు అయ్యిందన్నారు. గతంలో రాష్ట్రమంతా అంతా బాధపడుతుందని మాట్లాడారని గుర్తు చేశారు. కొంతమందికి జీవోతో ఇబ్బంది ఏర్పడితే వాటిని ప్రభుత్వమే పరిష్కరించాలన్నారు. కోదండరాం స్పందిస్తూ ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడంతో పాటు అన్ని జిల్లాల్లోనూ దీంతో సమస్యలు ఏర్పడ్డాయన్నారు.

ప్రెసిడెన్షియల్ మార్పు చేయడమే శాశ్వత పరిష్కారం: మంత్రి శ్రీధర్ బాబు

కేంద్రహోంశాఖ నుంచి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో మార్పులతోనే 317జీవో వివాదాలకు శాశ్వత పరిష్కారమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లతో అశాస్త్రీయంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెచ్చారని విమర్శించారు. దీంతో ఉద్యోగుల స్థానికత, సీనియార్టీలపై వివాదాలు రేగాయని, నాలుగు జిల్లాలకు కొత్త ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. 317జీవో రద్దు చెద్దామన్న మళ్లీ కొత్త సమస్యలొస్తాయన్న ఆందోళన ఉందన్నారు. 317జీవోను ఉద్యోగులు మరణ శాసనంగా భావించారన్నారు. రాష్ట్ర ఉద్యోగుల ఫౌజు సమస్యలతో పాటు సెంట్రల్ ఎంప్లాయిస్ ఫౌజు కేసులపై కూడా నిర్ణయం తీసుకోవాల్సిఉందన్నారు. 317జీవో బాధితులకు న్యాయం చేసేందుకు, సమస్యలు పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సబ్ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. దరఖాస్తుల వడపోత తర్వాత ప్రస్తుతం 32వేలకు పైగా దరఖాస్తులు ఉన్నాయన్నారు.

12మార్లు ఇప్పటికే సబ్ కమిటీ సమావేశమైందని, స్థానికత వివాదంగా మారిందని, అడ్వకేట్ జనరల్ తో ఐదు సార్లు భేటీ అయ్యామని, శాస్త్రీయంగా సమస్య పరిష్కారం జరిగేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఉద్యోగుల సర్వీస్, పదోన్నతుల పరిరక్షణకు గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 2018లో తీసుకొచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలులో ఉండేంత వరకు సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని పరిష్కరించే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు కొన్ని వెసులుబాటుతో 317జీవో కు సంబంధించి వివిధ శాఖల పరధిలోని కొన్ని వందల దరఖాస్తులు పరిష్కరించామని వెల్లడించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ 317జీవోతో కొన్ని లాభాలు కూడా ఉన్నాయని వివరిస్తూ అటువంటి వాటిని కొనసాగేలా సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

ఆ చట్ట సవరణ బిల్లుల్లో బీసీల రిజర్వేషన్ల అంశమేదీ..?: కేటీఆర్​
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. పురపాలక, జీహెచ్‌ఎంసీ, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లుల్లో ఈ అంశం లేదని చెప్పారు. మూడు బిల్లులకు బీఆర్‌ఎస్‌ తరఫున సవరణలు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీలో మీడియా పాయింట్​ వద్ద మాట్లాడిన కేటీఆర్​.. తమ సవరణలను ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అసరమైతే సభలో డివిజన్‌కు కూడా పట్టుబడుతామని స్పష్టం చేశారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. నవంబర్‌లోగా కులగణన పూర్తి చేస్తామని అధికారపార్టీ చెప్పిందన్నారు. కులగణనపై తేల్చకుండా చట్ట సవరణకు అసెంబ్లీలో ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 శాతానికిపైగా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా చేస్తున్నారని విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్లు ప్రస్తావించకపోవడం బీసీలను మోసం చేయడమేనని ఆరోపించారు.

మంత్రుల పరస్పర ప్రశ్నలెందుకూ..?

శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావు మధ్య వాడీవేడి సంభాషణ జరిగింది.ప్రశ్నోత్తరాల్లో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి నల్లగొండ జిల్లాలోని నీటి సమస్యలను గురించి సంబంధిత మంత్రిని ప్రశ్నించారు.దీనిపై హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేబినెట్‌ నిర్ణయం అంటే సమిష్టి నిర్ణయమని, క్వశ్చన్‌ అవర్‌లో ఒక మంత్రి మరొక మంత్రిని ప్రశ్న అడగడం ఏంటని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు ప్రశ్నించారు. మంత్రులే ప్రశ్నలు అడిగితే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందన్నారు. కొత్త సంస్కృతిని సభలో తీసుకురావద్దని స్పీకర్‌ను కోరారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కోమటిరెడ్డి మంత్రిగా ఉన్నారని, వారి హయాంలోనే మూసీ మురికి కూపంగా మారిందన్నారు. అప్పుడు వారు సరిగ్గా చేసిఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. హరీశ్‌ రావు బీఆర్ఎస్‌కు డిప్యూటీ లీడరా?, ఎమ్మెల్యేనా?.. ఏ హోదాతో మాట్లాడుతున్నారు?, ఆయనకు ప్రశ్నించే హక్కు లేదన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్​ ఏడాదిగా సభకు రాకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానపరచడమేనన్నారు. నల్గొండ ప్రజల కడుపులో ఆవేదన ఎలా ఉంటుందో తాను చెప్పానని.. డబ్బున్న వాళ్లు హైదరాబాద్‌ వచ్చారని, లేని వాళ్లు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హరీశ్‌ రావు ఒక్కసారీ ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్దకు రాలేదని.. ఆయనకు నల్గొండ గురించి, తన గురించి మాట్లాడే హక్కు లేదని కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు.

నా మాటలు విక్రీకరించారు.: రాజగోపాల్​ రెడ్డి

నూతన సచివాలయం పక్కనే కొత్త అసెంబ్లీ భవనం నిర్మిస్తే బాగుంటుందన్న తన వ్యాఖ్యలను వక్రీకరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ అంటే నాకు గౌరవమని, ఆయన లెజెండరీ నాయకుడని..ఆయనంటే అందరికీ అభిమానమని కొనియాడారు. తాను ఎన్టీఆర్ ఘాట్ తొలగించి కొత్త అసెంబ్లీ కట్టాలని అన్నట్లుగా నేను అనని మాటల్ని అన్నానని వక్రీకరించి దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్వక్తం చేశారు.నా ఎదుగుదలను అడ్డుకునే కుట్ర జరుగుతుందని, దయచేసి మరోసారి ఇలాంటి అబద్ధపు ప్రచారాలు పునరావృతం కాకుండా చూడాలని మీడియా సోదరులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వచ్చినా 10 ఏళ్ళ తరువాత కూడా ఆంధ్రమీడియా రాష్ట్ర రాజకీయాలను శాసించాలని చూస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిని మేము ఏ మాత్రం ఒప్పుకోబోమన్నారు. ఎన్టీఆర్ అంటే మాకు గౌరవం ఉందని కానీ ఆంధ్ర మీడియా నా మాటలను వక్రీకరించిందని ఆరోపించారు. కొందరు మమ్మల్ని వివరణ అడుగుతున్నారని, మాకు కూడా ఆత్మ గౌరవం ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో గ్రావిటీ ద్వారా నీరు వచ్చే ప్రాణహిత- చేవెళ్లను పక్కకు పెట్టారన్న రాజగోపాల్‌రెడ్డి రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని విమర్శించారు. ఎవరిని అడగుండానే విపరీతంగా ప్రాజెక్టుల అంచనాలు పెంచుకున్నారనీ, ఎక్కడి నుంచి నీరు తీసుకోవాలో నిర్ధారించకుండానే డిండి ఎత్తిపోతల చేపట్టారన్నారు. ఇంజనీర్లను అడగకుండానే కేసీఆర్‌ ఒక్కరే నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. రూ.2 లక్షల కోట్ల ఆదాయం వచ్చే ఓఆర్‌ఆర్‌ను రూ.7 వేల కోట్లకు అమ్మేశారని ఆరోపించారు.

సభనే నడపలేరు.. రాష్ట్రాన్ని ఎలా నడుపుతారు..? అక్బరుద్దీన్

తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అధికార పక్షంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లు అసెంబ్లీనే సరిగ్గా నడపలేకపోతే.. ఇక ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారంటూ మండిపడ్డారు. కోపంతో పేపర్లను విసిరేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అధికార, విపక్ష నేతలు ఒకరినొకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో అధికార పక్షంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లు అసెంబ్లీనే సరిగ్గా నడపకలేపోతే.. ఇక ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారంటూ మండిపడ్డారు. కోపంతో తన చేతిలో ఉన్న పేపర్‌ను విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో అప్పుల గురించి మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ మండిపడ్డారు. ఏ అంశంపై చర్చ చేపడుతున్నారని సమాచారం ఇవ్వాలన్నారు. సభను నడిపే విధానం ఇది కాదంటూ ధ్వజమెత్తారు. ”పార్లమెంటులో కూడ చర్చించాల్సిన అంశాల గురించి ముందుగానే చెబుతారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com