మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ ఆరోపణలు
కాంగ్రెస్ వాళ్లు సర్కార్ నడుపుతలేరని, సర్కస్ నడుపుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఫార్ములా వన్ ఈ-కార్ రేస్‌పై చర్చ పెట్టడానికి దమ్ములేక రేవంత్ పారిపోతున్నాడని మండిపడ్డారు. రోజు సాయంత్రం 4 నుంచి 6 గంటలవరకు రేవంత్ పత్తాలు ఆడుతాడంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు. కారు రేస్ ఇష్యూలో కాంగ్రెస్ ఎంత కక్ష్య చేసినా లీగల్‌గా ఎదుర్కొంటానని కేటీఆర్ అన్నారు. నా మీద కేసు కేసు పెట్టె దమ్ము ఉంది కానీ చర్చ పెట్టె దమ్ము లేదా? రేవంత్ నీ వీరత్వం నాలుగు గోడల మధ్య కాదు.. నాలుగు కోట్ల మంది ప్రజలు చూసేలా సభలో చర్చ పెట్టు దమ్ముంటే అంటూ సవాల్ విసిరారు. రేవంత్‌కు రోజు సాయంత్రం 4గంటల నుంచి 6 గంటలవరకు పత్తాలు ఆడే అలవాటు ఉందని ఆరోపించారు. “ కాంగ్రెస్ వాళ్లు హౌలగాళ్ళు.. నా రాష్ట్రం దివాళా తీసిందని చెబితే ఎవడైనా పెట్టుబడులు పెడతారా? హైద్రాబాద్ నగరం అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతుంది. అమరావతితో పోటీ పడే పరిస్థితులలో హైద్రాబాద్ లేదు. స్టే ఉన్న ఇళ్లను కూల్చిన విషయంపై బాధ్యత రంగనాథ్ తీసుకుంటాడా“ అని ప్రశ్నించారు.
లీకు వీరుడు సీఎం
ఇక రేవంత్ రెడ్డి స్వయంగా కారు రేస్ పై దుష్ర్పచారం చేస్తున్నారన్నారని, ఫార్ములా ఈ, ఇతర స్కాములంటూ అసత్యాలను ప్రచారం చేసే కన్న సభలో చర్చ పెడితే నిజాలు తెలుస్తాయని కేటీఆర్ సవాల్ చేశారు. చర్చ నాలుగు గోడల మద్య కాదు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టమని డిమాండ్ చేస్తున్నామని, లీకు వీరుడు సీఎం ఇచ్చే లీకులే తప్ప నిజాలు అధికారికంగా చెప్పె దమ్ములేదన్నారు. ఈ ఫార్ములా రేసులో విషయమే లేనప్పుడు ముందే తాను కోర్టులకు వెళ్లి ముందస్తు బెయిల్ అడగాల్సిన అవసరం లేదని, న్యాయంగా వ్యవహరించే, ప్రభుత్వ అరోపణలు పరిశీలిస్తే ఏ జడ్జి అయినా వేంటనే కేసు కొట్టేస్తారనే నమక్మముందన్నారు. అధికారికంగా చెప్పే దమ్ములేక క్యాబినెట్ లో నాలుగు గంటల చర్చ అంటూ వార్తలు రాపిస్తున్నారని, కేబినెట్ అంటే గాసిప్ బ్యాచ్ లెక్క తయారైందని, నిజాలు చెప్పే దమ్ము లేఖ సిఎస్ తో నోటీసులు, అనుమతులు అంటూ లీకులిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్ధానిక సంస్ధల చట్టాల సవరణలను వ్యతిరేఖిస్తున్నామన్నారు.
బీసీలకు అన్యాయం
అలాగే చట్ట సవరణ వల్ల బీసీలకు పూర్తి అన్యాయం జరుగుతుందని కేటీఆర్ అన్నారు. బీసీలకు ఇచ్చిన 42 శాతం హమీ గంగలో కలిసినట్టే అవుతుందని, ఎన్నికల కోసం హమీలిచ్చి ఇప్పుడు 2010 సుప్రీం కోర్టు కేసును చట్టంలో ప్రస్తావిస్తుందన్నారు. 42శాతం రిజర్వేషన్లును పక్కన పెట్టేలా ప్రత్యేక బీసీ కమీషన్ సిఫార్సులు, ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలంటూ కొత్త మెలికలు పెడుతుందని, ఈ అంశంలో అన్ని పార్టీల మద్దతున్న నేపత్యంలో ఈ చట్ట సవరణలోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అని నిబంధనలు పెట్టండన్నారు. చట్టం చేయాలని, కోర్టుల అంగీకరించకుంటే అవసరం అయితే రాజ్యంగ సవరణ కోసం కేంద్రానికి పోదామని సవాల్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి పార్లమెంట్ లో రాజ్యంగ సవరణ చేయవచ్చని, కానీ బీసీలను మోసం చేసేందుకే ఈ సవరణలను కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన స్ధానిక సంస్ధల చట్టాల సవరణలను వ్యతిరేఖిస్తున్నామన్నారు.