Saturday, April 5, 2025

ఈ బడ్జెట్ ఆరు గ్యారెంటీల హామీపత్రమే సిఎం రేవంత్ ట్వీట్

ఆరు గ్యారెంటీలకు హామీ పత్రం ఈ బడ్జెట్ అని, ఆర్భాటపు అంకెలు కాకుండా వాస్తవపు లెక్కల బడ్జెట్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2024-25 వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం, ఆర్ధిక శాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా.. ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలు, రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమాన్ని సమన్వయం చేసుకుని రూపొందించారని సీఎం ప్రశంసించారు. అలాగే ఆరు గ్యారెంటీలకు హామీ పత్రం ఈ బడ్జెట్ అని స్పష్టం చేశారు. అంతేగాక ఆర్భాటపు అంకెలు కాదు, వాస్తవపు లెక్కల బడ్జెట్ ఇది అని తెలిపారు. ఇక కేంద్రం వివక్ష.. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాల మధ్య తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేలా ఈ బడ్జెట్ ను రూపొందించిన డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమాత్యులు మల్లు భట్టీ విక్రమార్క కు , వారి బృందానికి నా అభినందనలు అంటూ రేవంత్ రెడ్డి ఎక్స్ లో రాసుకొచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com