Friday, March 21, 2025

రేవంత్‌రెడ్డి సర్కార్‌కి నిర్మాతల మండలి లేఖ

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ పేరుతో చలనచిత్ర అవార్డులను ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే పెద్ద ఎత్తున ఈవెంట్ ని నిర్వహించి అవార్డులు ప్రదానం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నంది అవార్డుల పేరుతో ప్రభుత్వం అవార్డులు ఇచ్చేది. విభజన తర్వాత ఆ అవార్డులకు బ్రేక్ పడింది. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ అవార్డులను పునరుద్ధరించాలని నిర్ణయించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి సినీ పరిశ్రమ కృతఙ్ఞతలు తెలుపుతోంది. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కూడా కృతఙ్ఞతలు తెలిపింది.
“2024 సంవత్సరానికి గాను ఉత్తమ చలన చిత్రాలకు, ఉత్తమ కళాకారులు మరియు సాంకేతిక నిపుణులకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖులు మరియు గొప్ప వ్యక్తులైన ఎన్టీఆర్, పైడి జైరాజ్, బి.ఎన్. రెడ్డి, నాగి రెడ్డి మరియు చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లు మీద “గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్” (GTFA) ను ప్రదానం చేస్తున్నందుకు గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులైన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి మరియు తెలంగాణ FDC చైర్మన్ దిల్ రాజు గారికి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఇందుమూలంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చలనచిత్ర అవార్డులను పునరుద్ధరించడం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఇది తెలంగాణలో చలనచిత్ర నిర్మాణాన్ని మరింతగా ప్రోత్సహిస్తుంది అని తెలియజేస్తోంది.” అంటూ నిర్మాతల మండలి ప్రెస్ నోట్ ని విడుదల చేసింది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com