Thursday, November 28, 2024

నేను రేవంత్‌ రెడ్డి.. నా భార్య గీత కుల‌గ‌ణ‌న సర్వే చేయించుకున్న‌ సీఎం

నేను ఎనుముల రేవంత్‌ రెడ్డి.. నా భార్య పేరు గీతారెడ్డి.. రాజకీయాల్లో ఉన్నాను. జీతం 2 లక్షలు.. కొండారెడ్డిపల్లిలో వ్యవసాయ భూమి, కొడంగల్‌, హైదరాబాద్‌ లో సొంత ఇండ్లు ఉన్నాయి.“ అని సీఎం రేవంత్‌ రెడ్డి కుల గణన సర్వేలో వివరాలు నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో కుల‌గ‌ణ‌న స‌ర్వే ఎంతో ప్ర‌తిష్టాత్మంగా చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. రిజ‌ర్వేష‌న్లు, ప‌థ‌కాల అమ‌లు మరియు ఇత‌ర సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు రాష్ట్ర‌న ప్ర‌భుత్వం ఇంటింటి కుల‌గ‌ణ‌న స‌ర్వేను చేప‌డుతోంది. అధికారులు, ఎన్యుమ‌రేట‌ర్లు స‌ర్వేను విజ‌యవంతంగా పూర్తి చేస్తున్నారు. ఇక తాజాగా స‌ర్వేలో సీఎం రేవంత్ రెడ్డి సైతం పాల్గొని ఆయ‌న కుటుంబ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. సామాజిక‌, ఆర్థిక‌, విద్య‌, ఉపాధి, రాజ‌కీయ మ‌రియు కుల స‌ర్వేలో భాగంగా సీఎం వివ‌రాలు న‌మోదు చేయించుకున్నారు.
గురువారం ఎన్యుమ‌రేట‌ర్లు, అధికారులు జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసం వ‌ద్ద‌కు వెళ్లి వివ‌రాల‌ను సేక‌రించారు. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇంలంబర్తి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, తదితరులు ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లారు. వివ‌రాలు చెప్పిన అనంత‌రం రాష్ట్రంలో స‌ర్వే పురోగ‌తిపై రేవంత్ ఆరా తీశారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ పరిధిలో వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల‌ని ఆదేశించారు. వారి వివరాలు కూడా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాల్సిందేన‌ని అధికారుల‌ను ఆదేశించారు. వీలయినంత త్వరగా కుల సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో జ‌రుగుతున్న స‌ర్వేపై ప్ర‌జ‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. స‌ర్వే ద్వారా అర్హుల‌కే ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందుతాయ‌ని, రిజ‌ర్వేష‌న్ల విష‌యంలోనూ న్యాయం జ‌రుగుతుంద‌ని భావిస్తున్నారు. మ‌రోవైపు రాబోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌లోనూ స‌ర్వే ఆధారంగా రిజ‌ర్వేష‌న్లు కేటాయించాల‌ని నిర్ణ‌యించుకున్న సంగ‌తి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular