కడియం శ్రీహరిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు తిరుగుబాటు ఎగురవేశారు. కడియం శ్రీహరి చేరికను వ్యతిరేకిస్తున్న స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ కార్యకర్తలతో స్థానిక కాంగ్రెస్ నాయకురాలు సింగాపూరం ఇందిర సమావేశమయ్యారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ 30 సంవత్సరాల నుంచి కడియం శ్రీహరి తమను ఇబ్బందులకు గురి చేశారని, ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీకి తెలియచేస్తామని ఆమె తెలిపారు. 2 రోజుల్లో వేలాది మంది కార్యకర్తలతో భారీ సభ నిర్వహించి, పార్టీ నాయకులు, కార్యకర్తలు కడియం శ్రీహరి చేరికను ఏ విధంగా వ్యతికిరేస్తున్నారో అధిష్టానానికి తెలియచేస్తామని, కార్యకర్తలకు తాను అండగా ఉంటానని సింగాపూరం ఇందిర కార్యకర్తలు, నాయకులకు హామీ ఇచ్చారు.