ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు. సినిమా ప్రొడక్షన్ పర్యవేక్షకులుగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు వ్యవహరిస్తున్నారు. హరినాథ్ పులి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “రేవు” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ టీమ్ ఫ్యాషన్ షో మరియు స్పెషల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో చిత్ర బృందం తో పాటు మురళీ మోహన్, ఆర్జీవీ, అనన్య నాగళ్ల, సంపత్ నంది, ఉత్తేజ్ గెస్టులుగా పాల్గొని సందడి చేశారు.
మురళీ మోహన్ మాట్లాడుతూ.. రేవుల దగ్గర జీవనం గడిపే మత్స్యకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా వడ్డీ వ్యాపారులు వారి శ్రమను దోచుకుంటారు. చేపలను వారు చెప్పిన రేటుకే కొనాలని షరతులు విధిస్తారు. మత్స్యకారుల జీవితాల్లోని ఇలాంటి ఇబ్బందులను నేపథ్యంగా ఎంచుకుని రేవు సినిమా చేయడం మంచి ప్రయత్నం. ప్రభు నాకు ఈ సినిమాను అంతా కొత్తవాళ్లు చేస్తున్నారు, బాగా చేశారని చెప్పినప్పుడు ఆసక్తిగా అనిపించింది. ప్రభు మనకున్న ఫిలిం జర్నలిస్టుల్లో ది బెస్ట్ పర్సన్. ఆయనను ఈ సినిమాకు పర్యవేక్షకుడిగా పెట్టుకోవడం మంచి నిర్ణయం. అలాగే మరో సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు.
స్టార్స్ ఉన్న సినిమా హిట్ అవ్వడం కంటే కొత్త వాళ్లతో చేసిన సినిమా హిట్ అయితే ఆ కిక్కే వేరు. ఆ సంతోషం పర్వతనేని రాంబాబు గారికి, ప్రభు గారికి, ప్రొడ్యూసర్ డాక్టర్ మురళీ గింజుపల్లి గారికి దక్కాలని కోరుకుంటున్నా. దర్శకుడు హరినాథ్ పులి చూడటానికి చిన్నవాడైనా సినిమా బాగా తెరకెక్కించాడు. స్టార్ సినిమాలకు ఓపెనింగ్స్ బాగా వస్తాయి కానీ చిన్న సినిమాకు బాగుందని మౌత్ టాక్ మొదలైతే హౌస్ ఫుల్స్ అవుతాయి. అలా రేవు సినిమా జరగాలని కోరుకుంటున్నా. రామ్ గోపాల్ వర్మ గారు కొత్త వాళ్లతో సినిమాలు చేసి వాటిని బాగా ప్రమోట్ చేయించి ప్రేక్షకుల్లో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంటారు. ఆయనతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. రేవు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అన్నారు.