Monday, March 10, 2025

సున్తీ కోసం వెళ్తే.. పురుషాంగం కోసేశాడు

టీఎస్​, న్యూస్​:ఖమ్మం జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆర్ఎంపీ నిర్వాకం.. పిల్లాడి ప్రాణాల మీదకు తెచ్చింది. సున్తీ కోసం వెళితే ఏకంగా పురుషాంగానే కోసేశాడు సదరు స్పెషలిస్ట్ ఆర్ఎంపీ. ఈయనగారి నిర్వాకానికి ఇప్పుడు బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం నగరంలోని ఆర్డీవో కార్యాలయానికి దగ్గర్లో హమీద్ క్లినిక్‌ ఉంది. ఈ క్లినిక్‌కి సున్తీ కోసం ఓ వ్యక్తి తన కొడుకుని తీసుకువచ్చాడు. అయితే, సున్తీ చేయబోతూ మర్మంగాన్ని కోసేశాడు ఆర్ఎంపీ. దీంతో మర్మాంగం తెగిపోవడంతో విపరీతమైన రక్తస్రావమై.. బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. బాలుడి పరిస్థితి మరింత విషమించడంతో వెంటనే హైదరాబాద్‌ నిమ్స్‌కి తరలించారు బాధిత కుటుంబ సభ్యులు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com