హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఆమనగల్లు మండలం రాంనుంతల శివారులో ఆర్టీసీ బస్సు – కారు ఢీకొన్నాయి. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు హైదరాబాద్ కర్మాన్‌ఘాట్‌కు చెందిన శివకృష్ణ వరప్రసాద్ గౌడ్, మేఘావత్ నిఖిల్, బుర్ర మణిదీప్గా గుర్తించారు. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అతివేగం, నిద్ర మత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.