Monday, March 17, 2025

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

అమెరికా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దురదృష్టవశాత్తు ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతి చెందిన వారిని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌ మండలం టేకులపల్లి వాసులుగా గుర్తించారు. మృతులు మాజీ సర్పంచ్‌ మోహన్‌రెడ్డి కుమార్తె ప్రగతిరెడ్డి (35), కుమారుడు హార్వీన్ (6), అత్త సునీత (56)గా గుర్తించారు. అమెరికాలోని ఫ్లోరిడాలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు ముగ్గురు మృతిచెందారు. కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కారులో వెళ్తుండగా ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో మోహన్ రెడ్డి కూతురు ప్రగతి రెడ్డి(35), మనవడు హార్వీన్(6) , కూతురు అత్త సునీత చనిపోగా.. అల్లుడు రోహిత్ రెడ్డి, చిన్న కుమారుడుకి గాయలయ్యాయి. దీంతో షాద్ నగర్ నియోజకవర్గంలో విషాదచాయలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో కారును ప్రగతి రెడ్డి భర్త రోహిత్ రెడ్డి నడుపుతున్నట్లు బంధువులు తెలిపారు. కారు, ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రోహిత్ దంపతులు 15 ఏళ్ల నుండి అమెరికాలో నివాసం ఉంటున్నారని బంధువులు పేర్కొన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రలో మునిగిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థాలినికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం మాచారం వద్ద 44వ జాతీయ రహదారిపై… ఆర్టీసీ బస్సును కారు డీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు మహబూబ్ నగర్ పట్టణం ప్రేమ్ నగర్ కాలనీ వాసులుగా గుర్తించారు పోలీసులు.
మరోవైపు ఆసిఫాబాద్ జిల్లా కోసిని గ్రామంలో రోడ్ ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ముగ్గురిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉండటంలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గ్రామ‌ సమీపంలోని కనకదుర్గ రైస్ మిల్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com