అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయలు మృతి చెందారు. టెక్సాస్ లోని అన్నాలో యుఎస్ రూట్ 75లో ఈ రోడ్డు ప్రమాదం చేటుచేసుకుంది. వైట్ స్ట్రీట్‌ను దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు కొలిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం పేర్కొంది. ఒకేసారి ఐదు కార్లు అత్యంత వేగంతో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష్య సాక్షులు తెలిపారు.
ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నలుగురిలో ముగ్గురు హైదరాబాద్ కు చెందిన వారుండగా, మరొకరు చెన్నైకి చెంది వారిగా గుర్తించారు. మృతుల్లో హైదరాబాద్ కు చెందిన ఆర్యన్ రఘునాథ్ ఓరంపాటి(27), ఫరూక్ షేక్ (30), లోకేష్ పాలచర్ల (28) ఉండగా మరో వ్యక్తి తమిళనాడుకు చెందిన దర్శిని వాసిదేవన్ (25)గా గుర్తింతారు. వీరంతా కలిసి బెంటన్ విల్లేకు వెళ్లేందుకు కార్‌పూలింగ్ యాప్ ద్వారా కలిసినట్లు పోలీసులు నిర్ధారించారు.