Monday, March 10, 2025

Road Accident In Mahabubnagar అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

లారీని ఢీకొట్టిన బస్సు.. ముగ్గురు మృతి
మహబూబ్‌నగర్‌ ‌జిల్లా జడ్చర్లలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భూరెడ్డిపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌ ‌నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ట్రావెల్స్ ‌బస్సు లారీని ఢీకొట్టింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు టైర్‌ ‌పేలిపోవడంతో డ్రైవర్‌ ‌సడెన్‌ ‌బ్రేక్‌ ‌వేశాడు. అప్రమత్తమైన లారీ డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ ‌వేశాడు. ఆ వెనకాల వొస్తున్న బస్సు లారీని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com