Monday, February 24, 2025

వారణాసిలో రోడ్డు ప్రమాదం సంగారెడ్డికి చెందిన ముగ్గురు మృతి

ఉత్తరప్రదేశ్ వారణాసి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో జహీరాబాద్ నీటి పారుదల శాఖ డీఈ వెంకటరామిరెడ్డి (46), ఆయన భార్య విలాసిని (40), మల్గికి చెందిన కారు డ్రైవర్ మల్లారెడ్డి (42) ఉన్నారు. కుంభమేళాకు వెళ్లి వస్తుండగా భక్తులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. రోడ్డుపై వస్తుండగా వారికి ఎదురుగా ఉన్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయే సమయంలో అటుగా వస్తున్న టిప్పర్‌ను కారు బలంగా ఢొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి (46), భార్య విలాసిని (40) మృతి చెందారు. అలాగే కారు డ్రైవర్ మల్లారెడ్డికి కూడా మృత్యువాతపడ్డారు. మృతులు వెంకటరామిరెడ్డి స్వస్థలం న్యాల్‌కల్ మండలం మామిడిగి కాగా, సంగారెడ్డిలో స్థిర నివాసం ఉంటున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com