Monday, April 7, 2025

‘రాబిన్‌హుడ్’ బ్లాస్టింగ్ పోస్టర్

హీరో నితిన్ యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ ‘రాబిన్‌హుడ్‌’. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాబిన్‌హుడ్ టీం అందరికీ దీపావళి శుభాకాంక్షలు అందిస్తూ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. నితిన్ యాక్షన్ లోకి దిగడానికి రెడీగా వున్నట్లు ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ లో నితిన్ స్వాగ్ అదిరిపోయింది. ఈ బ్లాస్టింగ్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలో టీజర్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయి ప్రొడక్షన్, టెక్నికల్ వాల్యూస్ తో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రానికి నిర్మాతలు. టాప్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సాయి శ్రీరామ్ డీవోపీ గా పని చేస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com