కంటెంట్ ఈజ్ కింగ్‌గా నమ్ముతూ సినిమాలు తీస్తున్నారు నేటి యువ దర్శకులు. వినూత్నమైక కాన్సెప్ట్‌లతో, వైవిధ్యమైన సినిమాలు తీస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఇప్పుడు ఈ కోవలోనే యువ దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఓ చిత్రాన్ని ప్రేక్షకల ముందుకు రాబోతున్నాడు. ‘ఐ హేట్ మ్యారేజ్’ పేరుతో పరమేష్ రేణుకుంట్ల దర్శకత్వంలో ఆర్య సినిమా పతాకంపై ఎం.దయానంద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. సుగి విజయ్, జుప్సీ భద్ర హీరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత శ్రీనివాస రాజు క్లాప్ నివ్వగా, ప్రముఖ దర్శకుడు సుకుమార్ అన్నయ్య, రచయిత, నిర్మాత విజయ్‌కుమార్ కెమెరా స్వీచ్చాన్ చేశారు.
చిత్ర సంగీత దర్శకుడు వరికుప్పల యాదగిరి ముహుర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘నేటి యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకలు నచ్చే భావోద్వేగాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల వారికి కావాల్సిన అంశాలు వున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్ అందరిని కడుపుబ్బ నవ్విస్తుంది’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘సోమవారం నుంచి చిత్రీకరణ ప్రారంభించాం. ఏకధాటిగా డిసెంబర్ వరకు జరగే షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. రొటిన్‌కు భిన్నంగా ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్నిప్రేక్షకులకు అందించబోతున్నాం’ అన్నారు.