Sunday, May 4, 2025

రూట్‌ ఛేంజ్‌..

అమెరికాకు ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ మార్గం

పాకిస్తాన్ గగనతలం మూసేయడంతో విమానాల రాకపోకలన్నీ అస్తవ్యస్తం అయిపోయాయి. చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తోంది. దీంతో ఎయిర్ ఇండియా విమానాలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటోంది. దూరాన్ని తగ్గించుకుని..ఖర్చును కూడా తగ్గించుకోవాలని చూస్తోంది. అమెరికా మరికొన్ని దేశాలకు వెళ్ళేందుకు ఎయిర్ ఇండియా మార్గాలను అన్వేషిస్తోంది. ఢిల్లీ నుంచి మరో సిటీకి అక్కడి నుంచి అమెరికాకు వెళ్ళేలా మార్గాలను చూస్తోంది. పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేయడంతో కలుగుతున్న ఇబ్బందిని దీని ద్వారా అధిగమించాలని ఎయిర్ ఇండియా ప్లాన్ చేస్తోంది. ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళే విమానాలు చాలా ఎక్కువే ఉంటాయి. వారానికి 71దాకా ఫ్లైట్ లు రాకపోకలు సాగిస్తాయి. ఇది ఒక్క ఎయిర్ ఇండియా లెక్క మాత్రమేజ అందులో 54 ఢిల్లీ నుంచే వెళుతున్నాయి. అయితే ఇప్పుడు పాక్ మార్గం మూసుకుపోవడంతో…ఇండియాలో ఢిల్లీ నుంచి మరో సిటీకి వెళ్ళి అక్కడి నుంచి అమెరికా వెళ్లేలా రూట్ ను కనిపెడుతోంది. విదేశీ టెక్‌-స్టాప్స్‌ సంఖ్య తగ్గించడం, మరిన్ని నాన్‌-స్టాప్‌ సర్వీసులను త్వరలోనే పెంచుతామ’ని ఎయిరిండియా ఎండీ, సీఈఓ చెప్పారు. ప్రస్తుతం ఈ ఫ్లైట్ లు అన్నీ అరేబియా సముద్రం మీదుగా…చాలా దూరం వెళుతున్నాయి. దీని వల్ల సమయం ఎక్కవు పట్టడమే కాకుండా..బోలెండత ఖర్చు కూడా అవుతోంది.

ఢిల్లీ నుంచి ముంబయ్, అహ్మదాబాద్..
ఢిల్లీ నుంచి అమెరికాకు వెళ్ళే విమానాలను ముంబయ్ లేదా అహ్మదాబాద్ తీసుకువెళ్లి అక్కడి నుంచి డైరెక్ట్ గా వెళ్ళేలా చేయాలని ఎయిర్ ఇండియా భావిస్తోంది. దీని వలన ఐరోపాను టచ్ చేసే అవసరం ఉండదని అనుకుంటోంది. పాకిస్థాన్‌ గగనతల మూసివేయడం వలన సుమారు రూ.5,200 కోట్ల అదనపు వ్యయాలు కావొచ్చని ఎయిరిండియా అంచనా వేసింది. ఇందులో భారతీయ విమాన సర్వీసులకు నెలకు రూ.306 కోట్లు అదనపు ఖర్చు అవుతోంది. ఎయిర్ ఇండియా ప్లాన్ వర్కౌట్ అయితే విదేశీ విమానయాన సంస్థలు కూడా ఇదే బాటలో పయనిస్తాయి.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com