Saturday, November 16, 2024

గండిపేటలో పోలీసులపై తిరుగుబాటు

పోలీసులపైనే దాడికి యత్నించిన రౌడీ మూక

పోలీసులపై ఓ రౌడీ మూక కత్తులు, హాకీ స్టిక్స్‌తో దాడికి యత్నించిన ఘటన నగరంలో కలకలం రేపింది. ఓ కేసు విషయమై వెళ్లిన వారిపై రౌడీలు దాడికి యత్నించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గండిపేట బృందావన్‌ కాలనీలో జరిగింది.
నగరంలో రౌడీ మూకల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఓ కేసు దర్యాప్తులో భాగంగా వెళ్లిన పోలీసులపై రౌడీలు దాడికి యత్నించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గండిపేట బృందావన్‌ కాలనీలో జరిగింది. అనంతరం నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

ఓ కిడ్నాప్​ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గండిపేట బృందావన్‌ కాలనీకి వెళ్లారు. అయితే వారిని పట్టుకునే క్రమంలో పోలీసులపై కత్తులు, హాకీ స్టిక్స్‌తో దాడికి యత్నించింది రౌడీ మూక. ఈ అనూహ్య పరిణామంతో అప్రమత్తమైన పోలీసులు, స్టేషన్‌కు సమాచారం ఇచ్చి అదనపు బలగాలను రప్పించారు. దీంతో బలగాలు అక్కడకు చేరుకున్నాయి. వారిని చూసి పరారయ్యేందుకు రౌడీలు యత్నించారు. పారిపోతున్న వారిలో నలుగురు దుండగులను పోలీసులు పట్టుకున్నారు.

ఈ నెల 10న నరేందర్​, ప్రవీణ్​ అనే ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్​నకు గురయ్యారు. కిడ్నాపర్ల నుంచి ఎలాగోలా తప్పించుకున్న వారు పోలీసులను ఆశ్రయించారు. తమ స్థలాన్ని కబ్జా చేసి, తమను కిడ్నాప్​ చేసి బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.25 కోట్ల విలువైన వీరి స్థలంలో రౌడీ మూకలు తిష్టవేశారు. ఈ క్రమంలోనే నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. రౌడీలకు ఉప్పర్​పల్లి కోర్టు శుక్రవారం ఏడు రోజుల రిమాండ్ విధించింది. నరేందర్​, ప్రవీణ్​ను ఇటీవల ఇదే గ్యాంగ్​ కిడ్నాప్​ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

బుల్లెట్​ కలకలం
మరో ఘటనలో నార్సింగి పరిధిలోని బైరాగిగూడలో బుల్లెట్​ కలకలం రేపింది. తమ ఇంట్లోకి బుల్లెట్​ దూసుకువచ్చిందని యజమాని వెల్లడించారు. బుల్లెట్‌ చూసి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారని తెలిపారు. దీంతో ఇంటి యజమాని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. ఇలాంటి ఘటనే కొద్ది రోజుల క్రితం కట్టంగుర్​ పీఎస్​ పరిధిలో జరిగింది. ఓ లారీ డ్రైవర్​ హత్య కేసులో నిందితులను పట్టుకునే క్రమంలో పోలీస్​ సిబ్బందిపై పార్థి గ్యాంగ్​ దాడులకు పాల్పడ్డారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ గ్యాంగ్ దొంగిలించిన అభరణాలను మహారాష్ట్రలో విక్రయిస్తుంటారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular