Thursday, December 26, 2024

నాలుగు నెలల్లో రూ.1,177 కోట్ల జీరో టికెట్లు

మహాలక్ష్మి పథకం కింద నాలుగు నెలల్లో రూ.1,177 కోట్ల జీరో టికెట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. మహాలక్ష్మి పథకం ప్రారంభమైన తొలి రోజుల్లో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఆర్టీసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. ఆ తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరిగింది. ప్రస్తుతం సగటున రోజుకు 29.67 లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ పథకం ప్రారంభించినప్పుడు గ్రేటర్ పరిధిలోని ఆర్టీసి బస్సుల్లో 11 లక్షల మంది ప్రయాణిస్తే, ప్రస్తుతం ఆ సంఖ్య 21 లక్షలకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా సగటున డిసెంబర్ నెలలో 26.99 లక్షలు, జనవరిలో 28.10 లక్షలు, ఫిబ్రవరిలో 30.56 లక్షలు, మార్చిలో 31.42 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. ఏప్రిల్ 7వ తేదీ వరకు రూ. 1,177 కోట్ల విలువైన జీరో టికెట్లను ఆర్టీసి జారీ చేసింది. హైదరాబాద్‌లో సుమారు 6 లక్షల మంది మహిళలు రోజూ సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. గతంలో సిటీలో బస్సు పాసులు, బస్సు చార్జీలకు మహిళలకు ఒక్కొక్కరు రూ.1,500ల వరకు ఖర్చు చేసేవారు. మహాలక్ష్మి పథకం ద్వారా అంత మేరకు మహిళలు నిధులను ఆదా చేశారని ప్రభుత్వం తెలిపింది.

ప్రస్తుతం 2.82 లక్షలకు పడిపోయిన బస్‌పాసులు

నగరంలో ప్రస్తుతం విద్యార్థుల బస్‌పాస్‌లు లక్షా 60 వేలు, జనరల్ పాస్‌లు 90 వేలు, దివ్యాంగుల పాస్‌లు 30 వేలు, ఎన్జీఓ పాసులు 2 వేల వరకు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో అన్ని రకాల పాసులు కలిపి 2 లక్షల 82 వేలు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం అందుబాటులోకి రావడంతో నగరంలో ఉండే అన్ని రకాల బస్ పాసులపై ఈ ప్రభావం పడింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో 7 లక్షలకు పైగా బస్ పాసులు ఉండగా రాష్ట్రం విడిపోయిన తర్వాత బస్‌పాసుల సంఖ్య 4.50 లక్షలకు పడిపోయింది. కరోనా సమయంలో కొంతకాలం ఆర్టీసి బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో కరోనా తర్వాత బస్ పాసులు 3.9 లక్షల వరకు తగ్గిపోయాయి. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత బస్ పాసుల సంఖ్య 2.82 లక్షలకు పడిపోయినట్లు ఆర్టీసి గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com