-
రూ. 1350 కోట్ల బిల్లులు పెండింగ్
-
జీహెచ్ఎంసీలో బంద్‌కు పిలుపునిచ్చిన కాంట్రాక్టర్లు
జీహెచ్ఎంసీలో బిల్లులు పేరుకుపోయాయి. దీంతో జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు పోరుకు దిగుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న బకాయిలను చెల్లిస్తేనే పనులు చేస్తామంటూ తెగేసి చెబుతున్నారు. ప్రస్తుతం ప్రకటించిన పనులకు టెండర్లు దాఖలు చేయమని అల్టిమేటం జారీ చేశారు. ఈ నెల 18 నుంచి బంద్ పాటిస్తున్నామని, మూకుమ్మడిగా బంద్ లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు.
జీహెచ్ఎంసీలో ఇప్పటి వరకు రూ. 1350 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు టోకెన్లు ఇచ్చినా బిల్లులు విడుదల చేయడం లేదు. దాదాపుగా ఆరు నెలల నుంచి రూపాయి చెల్లింపులు లేవు. ఇప్పటికే దీనిపై కౌన్సిల్ మీటింగ్‌లోనూ ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని ఇటీవల బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. అయితే, జీహెచ్ఎంసీ ఖజానాలో డబ్బులు లేవని బిల్లులు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టర్లు బంద్‌కు వెళ్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ప్రస్తుతం రూ. 320 కోట్ల పనులకు టెండర్లు వేయాల్సి ఉంది. వాటికి టెండర్లు వేయమంటూ కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు.