Tuesday, November 19, 2024

ఢిల్లీ, పూణేలో రూ.2500 కోట్ల డ్రగ్స్ పట్టివేత

పోలీసు ఉన్నతాధికారులు ఎన్ని కఠిన చట్టాలు అమలు చేస్తున్నా.. సంబంధిత అధికారులు క్షేత్ర స్తాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా డ్రగ్స్ సరఫరా మాత్రం ఆగడం లేదు..

గల్లీ నుంచి ఢిల్లీ దాకా డ్రగ్స్ సరఫరా అవుతోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు సాగిన భారీ ఆపరేషన్ లో పుణె, న్యూఢిల్లీ నగరాల్లో జరిగిన దాడుల్లో రూ. 2,500 కోట్లకు పైగా డ్రగ్స్ ను సీజ్ చేశారు. నిషేధిత డ్రగ్ మెఫెడ్రోన్ 1,100 కిలోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పుణెలో ముగ్గురు మాదక ద్రవ్యాల స్మగ్లర్లను అరెస్టు చేయడంతో పాటు 700 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకోవడంతో ఆపరేషన్ ప్రారంభమైందని పోలీసులు తెలిపారు.

అనంతరం వీరిని విచారించగా ఢిల్లీ లోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో గోడౌన్ లాంటి నిర్మాణాల నుంచి అదనంగా 400 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

మెఫెడ్రోన్ సరుకును పూణేలో, కుర్కుంభ్ ఎంఐడిసి ప్రాంతంలో నిల్వ చేశారు. మహారాష్ట్ర లోని పుణె పోలీసులు స్వాధీనం చేసుకొని అతి పెద్ద మాదక ద్రవ్యాల రికవరీగా చెబుతున్నారు.

దేశంలో భారీ స్థాయిలో మాదక ద్రవ్యాల దందా కొనసాగుతోంది. అయితే, కుర్కుంభ్ ఎంఐడీసీకి చెందిన యూనిట్ల నుంచి ఢిల్లీ లోని స్టోరేజీ కేంద్రాలకు నిషేధిత మాదక ద్రవ్యాలను తరలిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఈ ఆపరేషన్ కు సంబంధించి ముగ్గురు కొరియర్లు సహా ఐదుగురిని పోలీసులు అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నారు. కొరియర్ బాయ్స్ పై గతంలో కేసులు నమోదైనట్టు పుణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular