Friday, April 4, 2025

రెచ్చిపోతున్న సైబర్ కేటుగాళ్లు.! అకౌంట్ నుంచి డబ్బులు మాయం

సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్ చేస్తూ వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం కాకులగుట్ట తండాకు చెందిన సంతోష్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఆర్బీఐ అధికారులం అంటూ నమ్మించాడు. క్రెడిట్ కార్డ్ ఇయర్లీ చార్జ్‌ పే చేయాలని చెప్పాడు. సంతోష్ వాట్సప్ నెంబర్‌కు లింక్ పంపాడు.

సంతోష్ లింక్‌ ఓపెన్ చేయగానే అతని SBI క్రెడిట్ కార్డ్ నుంచి 67 వేల 700 రూపాయల నగదు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన సంతోష్.. సైబర్ క్రైమ్ 1930 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. అనంతరం బాధితుడు స్థానిక మాచారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని ఫోన్ నంబర్లు, మెసేజ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com