Sunday, May 4, 2025

ఆర్టీసీ మెట్రో కాంబో ఆఫర్‌

బస్​పాస్​ ఉన్నవారికి గుడ్​న్యూస్​

హైదరాబాద్ నగరంలో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సాధారణ పాస్ హోల్డర్లకు టీజీఎస్​ఆర్టీసీ గుడ్​న్యూస్ అందించింది. ఇకపై బస్​పాస్ ఉన్న వారు అదనంగా రూ.20 చెల్లిస్తే మెట్రో డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించేందుకు అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్ ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతోనే మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టినట్లు టీజీఎస్​ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. ఆర్టీసీ అధికారులు మెట్రో కాంబో టికెట్ పేరుతో ప్రయాణికులకు పరిచయం చేశారు. జనరల్ బస్‌పాస్‌తో పాటు మెట్రో బస్‌పాస్ కలిగిన ప్రయాణికులు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే వెసులుబాటును కల్పించారు. కేవలం రూ. 20 అదనపు రుసుము చెల్లించి ఈ కాంబో టికెట్‌ను పొందితే, ఆ రోజు నగరంలోని అన్ని మెట్రో డీలక్స్ బస్సు సర్వీసులలో సురక్షితంగా ప్రయాణించవచ్చు. ఈ నూతన విధానం వివరాలను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు.

అన్ని మెట్రో డీలక్స్​ బస్సుల్లో
హైదరాబాద్​లోని అన్ని మెట్రో డీలక్స్ బస్సు సర్వీసులకు ఈ మెట్రో కాంబో టికెట్ వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన అనుభూతులను అందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ వర్గాలు స్పష్టం చేశాయి.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com