Friday, December 27, 2024

ప్రతి నెలా అదనంగా మరో వంద కోట్లు ఇవ్వండి…!

  • లేకపోతే సంస్థ మరింత నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది
  • ప్రభుత్వానికి లేఖ రాసిన ఆర్టీసి అధికారులు

ఆర్టీసి సంస్థ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ప్రతి నెలా అదనంగా మరో వంద కోట్లు ఇవ్వాలని ఆ సంస్థ అధికారులు ప్రభుత్వానికి లేఖలు రాశారు. లేకపోతే సంస్థ మరింత నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆ లేఖలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి (డిసెంబర్ 7, 2023) మహిళలకు మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం సగటున రోజు రూ.2 నుంచి 3 కోట్లు ఆర్టీసికి చెల్లిస్తోంది. అయితే సంస్థ మనుగడ కోసం మరిన్ని నిధులు కావాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఆర్టీసి బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రతి నెలా సంస్థకు రూ.200 కోట్లు ఖర్చు అవుతోంది. అయితే ఈ ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించకపోవడం, కేవలం 50 నుంచి 60 శాతం మేరకు నిధులను విడుదల చేస్తుండడంతో ఆర్టీసి సంస్థపై అదనపు భారం పడుతోంది. అయితే అధికారుల లేఖలకు స్పందించిన ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో అదనపు నిధులు ఇవ్వడం సాధ్యం కాదని, కొంత కాలం సర్దుబాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించినట్టుగా తెలిసింది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com